శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 22 జులై 2019 (08:46 IST)

22-07-2019 సోమవారం దినఫలాలు - గణిత, సైన్సు రంగాలలో...

మేషం: బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ పై అధికారుల ధోరణిలో మార్పు కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు చికాకులు తప్పనిసరిగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి.
 
వృషభం: స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రకటనలు, న్యాయ, బోధనారంగాల వారికి అనుకూలం. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. సంఘంలో గుర్తింపు, రాణింపు పొందుతారు. ప్రింటింగ్ రంగాల వారికి అనుకూలం. ఖర్చులు పెరగటంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు.
 
మిధునం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. క్రయ విక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో మెలకువ వహించండి. పొదుపు పథకాలు, చిట్‌ఫండ్ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. 
 
కర్కాటకం: పోస్టల్, టెలిగ్రాఫ్, కొరియర్ రంగాల్లో వారు ఒత్తిడి, చికాకులకు లోనవుతారు. సహోద్యోగులతో సమావేశాలు ఫలించకపోవచ్చు. దూరంలో ఉన్న వ్యక్తులు ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తుల వారికి సంతృప్తికరంగా ఉంటుంది. ఉన్నత విద్య, న్యాయ రంగాల వారు కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటారు.
 
సింహం: గణిత, సైన్సు రంగాలలో వారికి లాభాదాయకంగా ఉంటుంది. మీ చుట్టు ప్రక్కల వారితో సంభాషించేటప్పుడు మెళకువ వహించండి. ప్రత్యర్థుల కదలిక పట్ల ఓ కన్నేసి ఉంచండి. నిరుద్యోగులలో నూతనోత్సహం చోటుచేసుకుంటుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.
 
కన్య: కోర్టు వ్యవహారాలు సామాన్యంగా ఉండగలవు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసిన వస్తుంది. మీ సన్నిహితుల మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. శెనగలు, కంది, చింతపండు, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి.
 
తుల: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ప్రయాణాల్లో తొందరపాటుతనం వస్తువులను చేజార్చుకుంటారు. మీ అంతరంగిక విషయాలను గోప్యంగా ఉంచండి. గౌరవ ప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది. ఇంటి కోసం విలువైన ఫర్నిచర్ సమకూర్చుకుంటారు. క్రీడల పట్ల ఆసక్తి అధికమవుతుంది.
 
వృశ్చికం: శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. శస్త్ర చికిత్స చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆటోమోబైల్, ట్రాన్సుపోర్టు రంగాలలో వారికి జయం చేకూరును.
 
ధనస్సు: సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక, కలప వ్యాపారులకు లాభాదాయకం. చిన్నారుల విద్యా విషయాలు ప్రోత్సాహకంగా ఉంటాయి. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లకు అనుకూలం. మీరు చేసిన పనికి ప్రత్యుపకారం పొందుతారు. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన రోజులు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి.
 
మకరం: విద్యార్హతలు పెంపొందించుకొనే ప్రయత్నాలు చేస్తారు. గతంలో చేసిన పనులకు ఇప్పుడు ఫలితాలు కలుగుతాయి. స్త్రీలు ఆహార విషయంలో పరిమితి పాటించండి. చివరిలో వ్యవహారాలు మందగిస్తాయి. గృహనిర్మాణ సంస్థలు బ్యాంకు లావాదేవీలకు అనుకూలం. కొన్ని సమస్యలు పరిష్కరించలేనంత జటిలమై చికాకు పుట్టిస్తాయి.
 
కుంభం: మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయటం మంచిది. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. ప్రియతములతో ప్రయాణాలకు ఏర్పాటు చేసుకుంటారు. సమయానికి మిత్రులు సహకరించక పోవటంతో అసహనానికి గురవుతారు. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి.
 
మీనం: చిన్నారులు, ప్రియతములతో ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. స్త్రీలకు స్థిరాస్తి అమర్చుకోవాలి అనే కోరిక స్ఫురిస్తుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం.