మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 25 జులై 2019 (09:01 IST)

25-07-2019 గురువారం దినఫలాలు - మీరు ప్రేమించే వ్యక్తితో...

మేషం : బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలలో శ్రమాధిక్యత తప్పదు. విరామ కాలక్షేపాల ద్వారా ఊరట పొందుతారు. ఆంతరంగిక వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడగలవు. సంఘంలో గుర్తింపు లభిస్తుంది.
 
వృషభం : ప్రముఖులతో పరిచయాలు, నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. దైవ కార్యాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
మిథునం : దంపతుల మధ్య ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. రావలసి ధనం చేతికందటంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. స్త్రీల ఆరోగ్యము మందగిస్తుంది.
 
కర్కాటకం : రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు వేస్తారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. క్రయ విక్రయాలు వాయిదాపడుట మంచిది. రుణాలు తీరుస్తారు.
 
సింహం : కుటుంబ అవసరాలు పెరగడంతో అదనపు సంపాదన దిశగా ఆలోచనలు చేస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
కన్య : ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు షాపింగ్ విషయాలలో మెళుకువ అవసరం. సన్నిహితులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం. సోదరులతో అవగాహన లోపిస్తుంది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
తుల : ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రుల కలయికతో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. యాదృచ్ఛికంగా పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
వృశ్చికం : ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. దంపతుల మధ్య ఊహించని చికాకులు తలెత్తుతాయి. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
ధనస్సు : వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. కుటుంబీకుల మధ్య కొత్తవిషయాలు చర్చకు వస్తాయి. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ మనోభావాలకు మంచి స్ఫురణ లభిస్తుంది.
 
మకరం : స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. రేపటి గురించి ఆందోళన చెందుతారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన, ఇతర వ్యాపకాలు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
కుంభం : వ్యాపార రంగాలలో వారికి గణనీయమైన అభివృద్ధి. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. ఆర్థిక విషయాలలో చురుకుదనం కానవచ్చును. భార్యభర్తల మధ్య అవగాహనలోపం అధికమవుతుంది.
 
మీనం : మీకు అత్యంత సన్నిహితులైన ఒకరు మీకు చాలా వేదన కలిగిస్తారు. స్త్రీలకు షాపింగ్‌లో ఏకాగ్రత అవసరం. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందన్నిపొందుతారు. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారులకు శుభదాయకం. విద్యార్థులు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలలో చికాకులు తప్పవు.