శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : బుధవారం, 24 జులై 2019 (10:41 IST)

24-07-2019- బుధవారం మీ రాశి ఫలితాలు..

మేషం: ఆర్ధికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, ఉద్యోగా లందు పై అధికారుల ఒత్తిడిని ఎదుర్కుంటారు. ప్రయాణాలలో మెళకువ అవసరం. విలువైన పత్రాలు చేజారిపోయే ఆస్కారం ఉంది. మీ వ్యవహారాలు సాధ్యమైనంత వరకు మీరే సమీక్షించుకోవడం మంచిది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. 
 
వృషభం: పత్రికా సంస్దలలోని వారికి ఊహించని సమస్యలెదురవుతాయి. ఏ వ్యవహారంలోను ఇతరులపై అతిగా ఆధారపడటం మంచిది కాదు. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్యత్యాలు పెంపొందుతాయి. బ్యాంకు పనుల్లో ఆలస్యం ఆందోళన కలిగిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ప్రముఖులను కలుసుకుంటారు.
 
మిధునం: ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. స్త్రీలకు అలంకారాలు గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది.
 
కర్కాటకం: ఉద్యోగస్తుల అధికారుల ప్రాపకం సంపాదిస్తారు. స్త్రీలకు గృహాలంకరణ వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. దంపతుల స్ధిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చికాకులు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.
 
సింహం: ఆర్ధిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. ప్లీడర్‌లకు, ప్లీడర్ గుమస్తాలకు సత్‌కాలం. స్నేహ సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. పోస్టల్, టెలిగ్రాఫిక్ రంగాలలో వారికి చికాకులు తప్పవు. మీ శ్రీమతి సలహ పాటించటం వల్ల ఒక సమస్య నుంచి బయటపడతారు. గతంలోని వ్యక్తులు తారసపడతారు.
 
కన్య: విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్ధికంగా ప్రోత్సహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు చికాకులు తప్పనిసరిగా ఉంటాయి. కీలక నిర్ణయాలు వాయిదా వేయండి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ముంద చూపుతో వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు.
 
తుల: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులను అధికంగా నమ్మడం వల్ల ఇబ్బందులకు గురౌతారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్యడం మంచిది కాదు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. 
 
వృశ్చికం: రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. దుబారా ఖర్చులు అధికం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. సాహస ప్రయత్నాలు విరమించండి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి.
 
ధనస్సు: ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలని వస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదాపడతాయి. మీ సమర్థతపై ఎదుటి వారికి నమ్మకం కలుగుతుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
 
మకరం: ఆర్థిక పరిస్థితి కాస్త కుదుటపడుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యంలో చికాకులు తప్పవు. కుటుంబీకుల ప్రేమకు మరింత దగ్గరవుతారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు. 
 
కుంభం: స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆశక్తి అధికం. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. ప్రేవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కుంటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో వారికి అనుకూలం. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది.
 
మీనం: నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సదవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో మెళుకువ అవసరం. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. లౌక్యంగా వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు. కుటుంబీకుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.