శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శనివారం, 27 జులై 2019 (11:17 IST)

27-07-2019- శనివారం మీ రాశి ఫలితాలు..

మేషం: వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకొవాలనే స్త్రీలకు కోరిక నెరవేరుతుంది. కొన్ని సమస్యలు పరిష్కరించలేనంత జటిలమై చికాకు పుట్టిస్తాయి. ఉద్యోగస్తులు సమర్ధవంతంగా పనిచేసి పై అధికారుల మన్ననలను పొందుతారు. మీ మాటలకు సంఘంలో గౌరవం లభిస్తుంది. నూతన పరిచయాలేర్పడతాయి.
 
వృషభం: విద్యార్హతలు పెంపొందించుకొనే ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు. ఏ వ్యవహారంలోను ఇతరులపై అతిగా ఆధారపడటం మంచిది కాదు. మీ మాటలకు సంఘంలో గౌరవం లభిస్తుంది. రుణయత్నాలలో కూడా స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
 
మిధునం: మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించడి. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. గతంలో చేసిన పనులకు ఇప్పుడు ఫలతాలు కలుగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ నాయకులు విదేశీపర్యటనలలో మెళకువ అవసరం.
 
కర్కాటకం: వృత్తి, వ్యాపారాలలో ఆశించినంత పురోభివృద్ధి సాధిస్తారు. ప్రత్యర్ధులు మీ శక్తి సామర్ధ్యాలను గుర్తిస్తారు. బంధు మిత్రులను కలుసుకుంటారు. ముఖ్యంగా ప్రింట్, మిడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సోదరీ, సోదరులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వకండి.
 
సింహం: కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు సంబంధించిన అధికారుల సహకారం అందుతుంది. మీ ఆలోచనా దృక్పథాన్ని మార్చుకొవాల్సిన సమయం. స్త్రీలకు స్థిరస్తి అమర్చుకోవాలి అనే కొరిక స్ఫురుస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగస్తుంది. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం.
 
కన్య: కత్త ఆదాయ మార్గాల అన్వేషిస్తారు. స్త్రీలు ఆహార విషయంలో పరిమితి పాటించండి. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. చిన్నారుల విద్యా విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. 
 
తుల: ఆర్థికపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. సన్నిహితులతో ఉన్న మనస్పర్ధలను తొలగించు కోవడానికి ఇది తగిన సమయం. పత్రక, ప్రైవేట్ రంగంలో వారికి చికాకులు అధికమవుతాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ఒత్తడి పెరుగుతుంది. ధనం విపరీతంగా వ్యయం అయినా ప్రయోజనకరంగా ఉంటుంది.
 
వృశ్చికం: ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తుంది. సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక, కలప వ్యాపారులకు లాభదాయకం. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. నూతన పరిచయాలేర్పడతాయి.
 
ధనస్సు: మీ సంతానం కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. విద్యార్ధులకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు. గృహనిర్మణ సంస్ధలు బ్యాంకు లావాదేవీలకు అనకూలం. ప్రియతములతో ప్రయాణాలకు ఏర్పాటు చేసుకుంటారు. నిరుద్యోగులకు అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
మకరం: విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన రోజు. స్త్రీల తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటి కోసం విలువైన ఫర్నిచర్ సమకూర్చుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది.
 
కుంభం: ఆర్ధికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఫలించక పోవచ్చును అందువల్ల మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు. నిరుద్యోగులకు త్వరలోనే మంచి అవకాశం లభించే ఆస్కారం ఉంది. క్రీడల పట్ల ఆసక్తి పెరుగును. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, వాణిజ్య రంగాల్లో వారికి ఆశించినంత ఫలతం ఉండదు.
 
మీనం: ఆర్ధిక ఒడిదుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. మీరు చేసిన పనికి ప్రత్యుపకారం పొందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తడి, చికాకులు ఎదుర్కొంటారు. పారిశ్రామిక కార్మికులలో నెమ్మదిగా మార్పులు కానవస్తుంది. నిరుద్యోగులు ఆశాజనకం. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.