బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: బుధవారం, 31 జులై 2019 (11:08 IST)

31-07-2019- బుధవారం రాశి ఫలితాలు... ఉద్యోగస్తులు ఆ విషయంలో మెళకువ అవసరం..

మేషం: స్టేషనరీ, ప్రింటింగు రంగాల వారికి చికాకులు అధికం. విద్యార్థులకు కోరుకున్న విద్యావకాశం లభిస్తుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతగా పూర్తిచేస్తారు. కీడు తల పెట్టే స్నేహానికి దూరంగా ఉండండి.
 
వృషభం: ఉద్యోగస్తులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. నిబద్దత, క్రమశిక్షణతో మీరు కోరుకుంటున్న గమ్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
మిధునం: రాజకీయా నాయకులు సభలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ బలహీనతను ఆసరా చేసుకుని కొంతమంది లబ్ధి పొందాలని యత్నిస్తారు. ఉపాధ్యాయుల తొందరపాటు తనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి.
 
కర్కాటకం: రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. నూతన దంపతులకు ఎడబాటు తప్పదు. సినిమా, విద్యా, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ, ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
సింహం: గొప్ప గొప్ప అవకాశాలు మీ దరిచేరతాయి. ముఖ్యమైన సంప్రదాయాలు పాటిస్తారు. బ్యాంకు పనుల్లో ఆలస్యం ఆందోళన కలిగిస్తుంది. బంధుమిత్రులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. కోళ్శ, మత్స్య, పాడి పరిశ్రమ, గొఱ్ఱెల రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తి.
 
కన్య: కుటుంబీకుల మద్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. మీ సోదరి మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కిరణా, ఫాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు. ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు.
 
తుల: మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులు పై అధికారులతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. మీ సంతానంతో కలిసి దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
వృశ్చికం: నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. ఉమ్మడి వెంచర్లు, నూతన పెట్టుబడుల ఆలోచన వాయిదా వేయండి. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి. 
 
ధనస్సు: క్లిష్ట సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా నడుస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త వహించండి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు.
 
మకరం: స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తినా గానీ నెమ్మదిగా సమసిపోతాయి. మీ కుటింబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయాలలో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో వారికి పనివారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు అధికారులను మెప్పించటానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది.
 
కుంభం: స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతుంది. ఆలయ సందర్శనాలలో ఒడిదుడుకులను ఎదుర్కుంటారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహరాల పునరాలోచన అవసరం. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. ఎంతో శ్రమించిన మీదట గాని అనుకున్న పనులు పూర్తి కావు. 
 
మీనం: మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. హోటల్, తినుబండారాల వ్యపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. రుణాలు తీరుస్తారు. ఒక ముఖ్యమైన విషయమై న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. మీ యత్నాలకు సన్నిహితులు, కుటుంబీకుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.