మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 30 జులై 2019 (08:50 IST)

30-07-2019- మంగళవారం దినఫలాలు - పనివారలతో చికాకులు...

మేషం: వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. బంధువులను కలుసుకుంటారు. ప్రియతముల కోసం, సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. మీ సంతానం పై చదువుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు.
 
వృషభం: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలలో ఆటంకాలను ఎదుర్కుంటారు. వైద్యులకు శస్త్ర చికిత్సలలో ఏకాగ్రత, మెళుకువ అవసరం. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
మిధునం: చిట్స్, ఫైనాన్సు వ్యాపారస్తులకు ఖతాదారులతో సమస్యలు తప్పవు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత వంటివి అధికమవుతాయి. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్ధికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
కర్కాటకం: బ్యాంక్ పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. శ్రీవారు, శ్రీమతితో దూర ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. ప్లీడర్‌లకు, ప్లీడర్ గుమాస్తాలకు సత్ కాలం. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
సింహం: ఆర్ధిక వ్యవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. తెలిసి తెలియక చేసిన పనులు ఇబ్బందులు పెడతాయి. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. 
 
కన్య: ఆర్ధిక లావాదేవీల పట్ల శ్రద్ధ వహించండి. ముఖ్యమైన వ్యక్తుల కలయిక వల్ల మేలు జరుగుతుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు.
 
తుల: ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల నుండి మెప్పు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేటు విద్యా సంస్థల వారికి పోటీ పెరుగుతుంది. ఇతరుల సాయం కోసం ఎదురు చూడకుండా మీ యత్నాలు సాగించండి.
 
వృశ్చికం: మిత్రులను అధికంగా నమ్మడం వల్ల ఇబ్బందులకు గురౌతారు. ప్రేమికులకు పెద్దలనుంచి ఇబ్బందులను ఎదుర్కుంటారు. మెడికల్, శాస్త్ర, వాణిజ్య రంగల వారికి శుభదాయకం. మీ జీవితం మీరు కోరుకున్నట్లుగానే ఉంటుంది. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. రుణాలు తీరుస్తారు.
 
ధనస్సు: స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళుకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. అతిధి మర్యాదలు బాగానిర్వహిస్తారు.
 
మకరం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోను అపరిచిత వ్యక్తులతో మెళుకువ అవసరం. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మీ విషయంలో ఒక చిన్న పొరపాటు పెద్ద తప్పిదంగా మారుతుంది.
 
కుంభం: ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
మీనం: కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహరాల పునరాలోచన అవసరం. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. స్త్రీలు టి.వి. ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. చిన్న తరహా, చిరు పరిశ్రమల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త వహించండి.