మేషం: హోటల్ తినుబండ వ్యపారస్తులకు సంతృప్తి కానవచ్చును. రావలసిన ధనం చేతికందంటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. గృహంలో సందడి కానవస్తుంది. సహోద్యోగులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు.
వృషభం: నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ప్రకటనలు, ప్రచురణలకు ఏర్పాట్లు చేస్తారు. ఆకస్మికంగా దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. ఖర్చులకు సరిపడు ఆదాయం సమకూర్చుకుంటారు.
మిధునం: ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలస్తాయి. కోళ్ళ, గొఱ్ఱె, పాడి పరిశ్రమ రంగాలలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రేమికుల మధ్య అపార్ధాలు చోటు చేసుకుంటాయి. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం, సహకారం అందిస్తారు. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
కర్కాటకం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి పనివారలతో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతోషం కలిగిస్తుంది.
సింహం: మీరు, మీ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి కృషి చేస్తారు. ఒక కార్యం నిమిత్తం ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ సంతానం భవిష్యత్తు గురించి కొత్త పథకాలు వేస్తారు. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
కన్య: బంధువుల ఆకస్మిక రాక మీకు ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. నూతన వ్యాపారాల పట్ల ఏకాగ్రత అవసరం. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత అవసరం. గత కొంత కాలంగా అనుభవిస్తున్న చికాకులు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.
తుల: శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. దైవ దర్శనాలలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. నిరుద్యోగులు నిరాశ, నిస్వృహలకు లోనవుతారు. విద్యార్ధులు క్రీడలు, ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనబర్చటం వల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కోక తప్పదు. బృంద కార్యక్రమాల్లో ఉల్లాసంగా చురుకుగా పాల్గొంటారు.
వృశ్చికం: ఆర్ధిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. స్థిరాస్తుల విషయంలో ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. మీరు అమితంగా అభిమానించే వ్యక్తులే మిమ్ములను మోసగిస్తారు. కంపెనీ సమావేశాల్లో ఆశించిన ఫలితాలు సాధించడం కష్టసాధ్యం. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
ధనస్సు: ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. హామీలు ఉండటం మంచిది కాదు. స్త్రీలకు కొత్త పరిచయాల వల్ల వ్యాపకాలు, కార్యక్రమాలు విస్తృతమవుతాయి. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినప్పటికిని వాటిని సద్వినియోగం చేసుకొలేకపోతారు.
మకరం: ఆర్ధికంగా బలం చేకూరుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. బంధువులతో చిన్న చిన్న కలహాలు జరిగే ఆస్కారం ఉంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి.
కుంభం: అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. గృహమునకు కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు.
మీనం: ఆర్ధిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఏదన్న అమ్మకానికి చేయు ప్రయత్నాలలో సఫలీకృతులు కాగలరు. ప్రముఖులతో కలిసి సభా సమావేశాలలో పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. స్వయం కృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి.