శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (12:14 IST)

#DailyHoroscope 03-08-2019- శనివారం మీ రాశి ఫలితాలు..

మేషం: లౌక్యంగా వ్యవహరించటం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మందులు, విత్తనాలు, రసాయన వ్యాపారులకు పురోభివృద్ది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
వృషభం: వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్థిరచరాస్తులు విక్రయించాలనే మీ ఆలోచన విరమించుకోవటం మంచిది. మీ వ్యవహారాలను స్వయంగా సమీక్షించుకోవటం ఉత్తమం. ఆకస్మిక ఖర్చులు, రుణ వాయిదా చెల్లింపుల వల్ల ఇబ్బందులెదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాల్లో జాగరూకతో మెలగండి.
 
మిధునం: ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విద్యార్థులు పై చదువుల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. టెక్నికల్, మెడికల్, వాణిజ్య రంగాల వారికి ఆశాజనకం. విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తుసామగ్రిని అందజేస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి నుంచి ఆహ్వానాలు అందుతాయి.
 
కర్కాటకం: స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలతం. ప్రముఖుల కలయిక కోసం పలుమార్లు తిరగవలసి వస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. కొన్ని సందర్భాల్లో అనాలోచితంగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది.
 
సింహం: స్త్రీలకు విలాసవస్తువులు, ఆడంబరాల పట్ల మక్కువ పెరుగుతుంది. ఆకస్మకంగా ఆలయాలను సందర్శిస్తారు. ఆటోమోబైల్, రవాణా, మెకానిక్ రంగల్లో వారికి అనుకూలమైన కాలం. మీ మిత్రుల కోసం, బంధువుల కోసం బరువు, బాధ్యతలు స్వీకరిస్తారు. చేయదలుచుకున్న మంచి పని వాయిదా వేయకండి.
 
కన్య: వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ, వివాహ యత్నాలు నెరవేరుతాయి. ఖర్చులు అధికమవుతాయి. నిర్మాణ పథకాలలో సంతృప్తి కానవస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదని గమనించండి.
 
తుల: స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లలలో పునరాలోచన అవసరం. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. విద్యార్థులలో మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది.
 
వృశ్చికం: వ్యాపార, ఆర్ధికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో మెళుకువ అవసరం. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తె ఆస్కారం ఉంది. కోరుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు.
 
ధనస్సు: ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లలలో పునరాలోచన అవసరం. ఎదుటి వారితో మితంగా సంభాషించండి. ఆత్మీయుల ద్వారా కీలకమైన విషయాలు గ్రహిస్తారు. ముఖ్యుల కోసం ధనం ఖర్చుచేస్తారు. స్త్రీలకు విలాసవస్తువులు, ఆడంబరాల పట్ల మక్కువ పెరుగుతుంది. 
 
మకరం: పత్రిక, ప్రైవేటు సంస్ధలలోని వారికి ఓర్పు, పనియందు ఏకాగ్రత అవసరం. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. బంధువురాక వల్ల కొంత అసౌకర్యానికి లోనవుతారు. ఉద్యోగస్తులదైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. చిన్న చిన్న ఆటంకాల వల్ల చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
 
కుంభం: కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం, పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి.
 
మీనం: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. నూతన దంపతులకు ఎడబాటు, చికాకులు తప్పవు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారితో చికాకులు వంటివి ఎదుర్కుంటారు.