08-08-2019 గురువారం దినఫలాలు - సంఘంలో కీర్తి, గౌరవం...

రామన్| Last Updated: గురువారం, 8 ఆగస్టు 2019 (09:45 IST)
మేషం: సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవటంతో అసహనానికి గురవుతారు. బంధువులను కలుసుకుంటారు. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. సన్నిహితులు, కుటుంబీకుల సహకారంతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు.

వృషభం: సంఘంలో కీర్తి, గౌరవం లభిస్తాయి. మీ సంతానం వైఖరి ఆందోళన కలిగిస్తుంది. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. స్త్రీలకు విలాసాలు, అలంకరణల పట్ల వ్యామోహం పెరుగుతుంది. ప్రేమికుల తొందరపాటుచర్యలు వివాదస్పదమవుతాయి. క్రయ విక్రయాలు భారీగా సాగుతాయి.

మిధునం: దూర ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నులై ఉంటారు. విద్యార్థులకు అధ్యాపకులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ జీవిత భాగస్వామితో సున్నితంగా వ్యవహరించండి. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లధోరణి ఆందోళన కలిగిస్తుంది. దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: ఫ్యాన్సీ, బేకరి, తినుబండారాల
వ్యాపారులకు ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటాయి. పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఉమ్మడి, ఆర్ధిక వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. వాహన చోదకులకు అప్రమత్తత అవసరం. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. చేపట్టిన పనుల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది.

సింహం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రియతముల గురించి అప్రియమైన వార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దల సహాయ సహకారాలు అందుకుంటారు. మీ సంతానం గురించి విపరీతంగా ఆలోచిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు.

కన్య: కళా, సాంస్కృతిక ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించటం వల్ల మాటపడక తప్పదు. కార్యసాధనలో మొండిధైర్యం, పట్టుదలతో ముందుకు సాగండి. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల అవగాహన ఏర్పడుతుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు సజావుగా సాగుతాయి.

తుల: మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. బంధుమిత్రులలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. రాజకీయనాయకులకు ప్రయాణాల్లో మెళుకువ అవసరం. భాగస్వామిక, కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. విద్యార్ధులకు అధ్యాపకులతో సత్సంబంధాలు నెలకొంటాయి.

వృశ్చికం: భాగస్వామిక చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలలో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులు రాత, మౌఖిక పరిక్షలలో ఏకాగ్రత వహించిన మంచి ఫలితాలు పొందగలరు. ఆస్తి వ్యవహారాల విషయమై సోదరీ సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.

ధనస్సు: ఆర్ధికస్థితి కొంత మెరుగుపడినా కుదుటపడటానికి మరి కొంతకాలం పడుతుంది. గృహ నిర్మాణాలలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తుల ఓర్పు, నేర్పులకిది పరీక్షా సమయం. నూతన వ్యాపారాల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. ఉపాధ్యాయులు సభ, సమావేశాలలో పాల్గొంటారు.

మకరం: వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు శుభదాయకం. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాలు అధికమవుతాయి. ప్రేమికులకు సన్నిహితుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.

కుంభం: పారిశ్రామిక రంగాల వారికి అవసరమైన లైసెన్సులు మంజూరవుతాయి. క్రయ విక్రయాలు వేగం పుంజుకుంటాయి. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి.

మీనం: కుటుంబీకుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. దూరప్రయాణాలు నిరుత్సాహపరుస్తాయి. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఇసుక రవాణాదారులకు ఆటంకాలను ఎదుర్కొంటారు. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. వ్యాపారులకు కావలసిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు.దీనిపై మరింత చదవండి :