Daily Horoscope
✕

13-12-2019 శుక్రవారం రాశిఫలాలు - వ్యాపారాల్లో పెరిగిన పోటీ... (video)

Written By రామన్
Updated: శుక్రవారం, 13 డిశెంబరు 2019 (13:44 IST)
మేషం : వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. పెద్దల ప్రమేయంతో కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికం. మీ యత్నాలు గోప్యంగా సాగించాలి. స్త్రీలు, అవసరాలు, కోరికలు, నెరవేరగలవు. విద్యార్థినుల మొండితనం అనర్థాలకుదారితీస్తుంది. 
 
వృషభం : పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి ఒత్తిడి అధికమవుతాయి. ప్రయాణాలు ఆలస్యం వల్ల పనులు వాయిదాపడతాయి. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. 
 
మిథునం : కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. రాజకీయ విషయాలపై ఆసక్తి కనపరుస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : దాన, ధర్మాలు చేసి మంచి గుర్తింపు పొందుతారు. విద్యార్థుల అతి ఉత్సాహం అనర్థాలతు దారితీస్తుంది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వీలైనంత వరకు మీ పనులు మీరే చేసుకోవడం ఉత్తమం. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. 
 
సింహం : స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. అపార్థాలు మాని ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయ నాయకులు సభ సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ఏ పని మొదలుపెట్టినా ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతాయి. 
 
కన్య : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించండం మంచింది. ప్రముఖుల సిఫార్సులతో పనులు సానుకూలమవుతాయి. వ్యాపకాలు తగ్గించుకుని ఉద్యోగ, వ్యాపారాలపై దృష్టిసారించండి. ఈడొచ్చిన మీ సంతానం వైఖరి చికాకు పరుస్తుంది. 
 
తుల : మీపై కొంతమంది నిఘా వేశారన్న విషయం గ్రహించండి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవడం మంచిది కాదు. స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్ళకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సభలు, సన్మానాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలోనూ, ఆహార వ్యవహారాల్లోనూ మెళకువ వహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలను క్రమంగా అధికమిస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : ధనవ్యయంతో ఏకాగ్రత చాలా అవసరం. బ్యాంకు పనులు మందగిస్తాయి. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. నిత్యావసరవస్తు స్టాకిస్టులు, రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. మీ గౌరవ, అభిమానులకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి.
 
మకరం : విద్యార్థినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సమస్యలు తప్పవు. ఖర్చులు, రాబడి విషయంలో ఏకాగ్రత వహించండి. సోదరులతో ఏకీభవించలేకపోతారు. 
 
కుంభం : శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. కోళ్లు, మత్స్యు, గొర్రెల వ్యాపారస్తులకు ఆందోళన అధికం అవుతుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఫ్లీడర్లు కోర్టు వాదోపవాదాల్లో రాణిస్తారు. దైవ, సేవ, పుణ్యకార్యాలకు ఇతోధికంగా సహాయం అందిస్తారు. బంధువులను ఆకట్టుకుంటారు. 
 
మీనం : ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరమని గమనించండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగుల నిర్లప్త ధోరణి వల్ల సదావకాశాలు జారవిడుచుకుంటారు. యోగ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 

అన్నీ చూడండి

అక్టోబర్ 22, 2026 నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా వుందంటే?

మార్కో రూబియో, సెర్గియో గోర్‌లకు జామ్ నగర్‌కు స్వాగతం పలికిన ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ

జంబూ సవారీలో అపశృతి, అమ్మవారి అంబారీని కిందపడేసిన ఏనుగు, వీడియో

ఆప్ఘనిస్థాన్ వ్యక్తి.. ఆయనకు నలుగురు భార్యలు.. 58 మంది పిల్లలు.. పోషించలేక ఇబ్బందులు.. (video)

పంజరంలో పెట్టిన పాలపిట్ట రోదనలో శుభం ఎలా కనిపిస్తుంది?: సజ్జనార్ ప్రశ్న

అన్నీ చూడండి

శిశువు మెడలో పేగు వేసుకుని జన్మిస్తే...?

నల్లపిల్లి, కన్ను అదరడం, సాయంత్రం ఇల్లు చిమ్మడం మంచిదేనా?

21-10-2026 బుధవారం దిన ఫలాలు - బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి...

20-10-2026 మంగళవారం రాశి ఫలాలు - ఆర్థిక విషయాల్లో ఇతరుల మాటల్ని నమ్మొద్దు

19-10-2026 సోమవారం ఫలితాలు - ఆశించిన ఆశించిన పదవి దక్కకపోవచ్చు...

తర్వాతి కథనం
Show comments