మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-12-2019 ఆదివారం మీ రాశి ఫలితాలు-మనశ్శాంతి కోసం కొన్ని విషయాల్లో..

మేషం: విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. స్త్రీలు టీవీ ఛానల్స్ కార్యక్రమాల్లో బాగుగా రాణిస్తారు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మనశ్శాంతి కోసం కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం క్షేమదాయకం.
 
వృషభం: ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. ఆలయ సందర్శనాల్లో నూతన వ్యక్తుల కలయిక సంభవించును. విద్యార్థులు ఇతర వ్యాపకాలు విడనాడి శ్రమించినట్లైతే సత్ఫలితాలు పొందుతారు. వాతావరణలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
మిథునం: ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు అయిన వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ సంతానం వల్ల మీ ఖ్యాతి ఇనుమడిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కుటుంబ విషయాల పట్ల మీ వైఖరిలో మార్పు వస్తుంది. 
 
కర్కాటకం: రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో ప్రతికూలతలెదురవుతాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. మిత్రులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు సన్నిహితుల ప్రోత్సాహంతో ఉపాధి పథకాలు చేపడతారు.
 
సింహం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. విధి నిర్వహణలో తప్పిదాలు దొర్లే అవకాశం వుంది. మీ కళత్ర వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ రాక బంధువులను ఆనందాన్నిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి.
 
కన్య: ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా వుండటం మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొంతమంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించే ఆస్కారం వుంది. రుణ విముక్తులు కావటంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. వాయిదా పడిన పనులు పునః ప్రారంభిస్తారు.
 
తుల: మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వుంటుంది. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఆస్తి వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం.
 
వృశ్చికం: వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల నుంచి మొహమ్మాటాలు ఎదురవుతాయి. మీ ఆంతరంగిక విషయాలు, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి.
 
ధనస్సు : వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఆకస్మిక ఖర్చులుంటాయి. ధన వ్యయంలో మెలకువ వహంచండి. కుటుంబీకుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.
 
మకరం: ఆర్థిక స్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు వాయిదా పడతాయి. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తి కావు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో ఒక అవగాహనకు వస్తారు.
 
కుంభం: వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు అమలు చేస్తారు. మీ సంతానం మొండితనం చికాకు పరుస్తుంది. ఆత్మీయులతో కలిసి విందులు, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీ ఆందోళన కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి అక్షర దోషాల వల్ల చికాకులు వంటివి ఎదుర్కొంటారు.
 
మీనం: మీ సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాల్సి వుంటుంది. ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఒకానొక సందర్భంలో మిత్రుల ధోరణి అసహనం కలిగిస్తుంది. వేడుకలు, శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.