Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

19-04-2019 శుక్రవారం దినఫలాలు .. ఆర్థిక లావాదేవీలు...

Written By రామన్
Updated: శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (09:05 IST)
మేషం: ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగులు, చేతి వృత్తుల వారికి ఆశాజనకం. వేడుకలు, శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి.
 
వృషభం: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. కృషి రంగానికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
 
మిధునం: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. వాహనం ఇతరులకు వచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
కర్కాటకం: మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త చాలా అవసరం.
 
సింహం: ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. నూతన వ్యాపారాల పట్ల మెళకువ వహించండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. విందు, వినోదాలలో పాల్గొంటారు. గృహమునకు కావలసిన విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. పనివారలతో సమస్యలు తలెత్తగలవు.
 
కన్య: దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన కీలకమైన సమాచారం అందుకుంటారు. ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని కార్యాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతుంది. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై యత్నిస్తారు. 
 
తుల: తరచు వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఖర్చులు, చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. విద్యార్థుల్లో ఏకాగ్రత, పట్టుదల చోటు చోసుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సత్సంబంధాలు నెలకొంటాయి. క్యాటరింగ్ పనివారలు, చేతివృత్తుల వారికి ఆశాజనకం. 
 
వృశ్చికం: విందు వినోదాలలో పాల్గొంటారు. ఏజెంట్లు బ్రోకర్లు, రిప్రజెంటేటివ్‌లకు మిశ్రమ ఫలితం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఒక లేఖ మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొబ్బరి, పానీయ వ్యాపారులకు కలిసి వచ్చే కాలం. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ముఖ్యమైన విషయాలను గోప్యంగా ఉంచండి. 
 
ధనస్సు: వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. ఇతరుల కారణాల వలన మీ కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. కుటుంబీకుల పట్ల ఆసక్తి పెరుగును. తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. 
 
మకరం: ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. స్థిరచరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. హోటలు తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ముఖ్యులతో ఆంతరంగిక విషయాలను చర్చిస్తారు. 
 
కుంభం: స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వలన అశాంతికి లోనవుతారు. మీ మిత్రుల కోసం, బంధువుల కోసం బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. కూర, పూల, వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. చిన్న తరహా పరిశ్రమలలో వారికి అనుకూలత. చిన్న చిన్న విధులను సైతం ఎక్కువ శ్రద్ధతో నిర్వర్తించే ప్రయత్నం చేయండి. 
 
మీనం: ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. భార్యా, భర్త మధ్య సఖ్యత నెలకొంటుంది. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments