15-04-2019 సోమవారం దినఫలాలు - మేష రాశివారు ఇలా మసలుకోండి..

రామన్| Last Updated: సోమవారం, 15 ఏప్రియల్ 2019 (08:58 IST)
మేషం: బంగారు, వెండి, వస్త్ర వ్యాపార రంగాల వారికి మెళకువ అవసరం. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. చేతివృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. దైవ, సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడుల విషయంలో దూకుడు మంచిదికాదు. పత్రికా, ప్రైవేటు సంస్థల్లోనివారికి మార్పులు అనుకూలిస్తాయి. బేకరీ, స్వీట్స్, తినుబండారాలు వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది.

మిధునం: ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సానుకూలమవుతాయి. విద్యార్థులకు సంతృప్తి కానవస్తుంది. ఎల్.ఐ.సి ఏజెంట్లకు, బ్రోకర్లకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. రాజకీయ, పారిశ్రామిక రంగాలవారికి అధిక పర్యటనల వలన ఆరోగ్యం మందగిస్తుంది.

కర్కాటకం: ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి అధికం. గృహం నిర్మాణాలు, మరమ్మత్తులలో వ్యయం అధికమవుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. స్త్రీలకు అయిన వారి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి.

సింహం: ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు ఇబ్బందులను ఎదుర్కుంటారు. విదేశీ ధనం అందటంతో మానసికంగా కుదుటపడుతారు. ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. విదేశీ వ్యవహారాలు, విద్యా, రవాణా, ప్రణాళికలు, బోధన, ప్రకటనల రంగాలవారు ఆచితూచి వ్యవహరించండి.

కన్య: కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడుతాయి. దూరప్రయాణాలలో మెళకువ అవసరం. కొత్త పనులు ప్రారంభించడంలో అడ్డంకులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.

తుల: మార్కెట్ రంగాల వారికి నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త రుణాలు, పెట్టుబడుల కోసం యత్నిస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. ఉమ్మడి కుటుంబ విషయాలలో మాడపడాల్సి వస్తుంది.

వృశ్చికం: దైవ, సేవా, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తితో పాటు ఆనందంగా గడుపుతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. పాతమిత్రులతో ఆనందంగా గడుపుతారు. దూరప్రయాణాలకై చేయు యత్నాలు ఫలిస్తాయి. భీమా, పెన్షన్, వ్యవహారాలు క్రయవిక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి.

ధనస్సు: ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు వ్యవహరిస్తారు. బంధువుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి మెళకువ అవసరం. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి.

మకరం: ఇతరులు దైవ, సేవా కార్యక్రమాలలో మీ పట్ల ఆకర్షితులౌతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. లాయర్లకు చికాకులు తప్పవు. ఆడిటర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. ఒకే కాలంలో అనేకపనులు చేపట్టుట వలన దేనిలోను ఏకాగ్రత వహించలేరు.

కుంభం: వృత్తుల వారికి సదవకాశాలు, ప్రజాసంబంధాలు బలపడుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. సహకార సంఘంలో వారికి రాజకీయాలలో వారికి చికాకు తప్పదు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.

మీనం: ప్రభుత్వ సంస్థల్లో వారికి ఆశించినంత గుర్తింపు లభించదు. స్త్రీలకు రచనలు, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. దీర్ఘకాలిక రుణాలను తీర్చి ఊపిరి పీల్చుకుంటారు. బంధుమిత్రులతో పట్టింపులెదుర్కుంటారు. పనులు పూర్తిచేస్తారు.దీనిపై మరింత చదవండి :