మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (07:23 IST)

11-04-2019 గురువారం దినఫలాలు - కర్కాటక రాశివారు వేళ తప్పి భుజిస్తే...

మేషం: స్థిరచరాస్తుల క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. దీర్ఘకాలిక పెట్టుబడులు, ఉమ్మడి వ్యాపారాల్లో పునరాలోచన అవసరం. ఇతరుల జోక్యం వలన మీ పాత సమస్యలు పరిష్కరించబడుతాయి. స్త్రీలకు అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
వృషభం: ఏజెన్సీలు, కాంట్రాక్టులు, పెట్టుబడులు లాభిస్తాయి. ధనవ్యయం చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం. కొబ్బరి, పండ్లు, పూల, చిరువ్యాపారులకు కలిసిరాగలదు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుతాయి. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మిధునం: రాజకీయాల్లో వారు ముఖ్యమైన వ్యవహారాలను గోప్యంగా ఉంచడం మంచిది. కళకారులకు, రచయితలకు, పత్రికారంగంలోని వారికి అనుకూలమైన కాలం. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. ఉద్యోగం చేసే చోట కొత్త ప్రయోగం చేయవద్దు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
కర్కాటకం: ఆహార విషయంలో వేళ తప్పి భుజించడం వలన ఆరోగ్యం భంగం. బ్యాంకు వ్యవహారాలలో అపరచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తినా గానీ నెమ్మదిగా సమసిపోతాయి. ఇంటా, బయట సమస్యలు తలెత్తినా తెలివితేటలతో పరిష్కరించ గలుగుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు.
 
సింహం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులు మీ పరిస్థితులను అర్థం చేసుకుంటారు. దూరప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగస్తాయి. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్ రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి.
 
కన్య: వృత్తి, ఉద్యోగాలందు ఉన్నవారికి ఆదాయం బాగుంటుంది. స్త్రీకు బంధువుల రాకతో పనిభారం అధికమవుతుంది. ఎరువులు, కిరణా, ఫ్యాన్సీ రంగాల వారికి అభిమానబృందాలు అధికమవుతాయి. మధ్య చిన్న చిన్న అభిప్రాయబేధాలు తలెత్తవచ్చు. రాజకీయాలలో వారికి అభిమానబృందాలు అధికమవుతాయి. 
 
తుల: ప్రలోభాలకు లొంగవద్దు. గృహానికి మరమ్మత్తులు చేయించగలుగుతారు. ఉపాధి పథకాల్లో స్థిరపడుతారు. రిప్రజెంటేటివ్‌‍లు, పత్రికా రంగాలవారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. ఆడిటర్లకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారలలో మంచి మార్పులు రాగలవు.
 
వృశ్చికం: మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. రాజకీయాలలోని వారు ఆచితూచి వ్యవహరించవలెను. తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. 
 
ధనస్సు: విదేశీ చదువులకై చేయు ప్రయత్నాలలో విజయం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడుతాయి. మీ సాయం పొందిన వారే వేలెత్తి్ చూపుతారు. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తలపెట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. రుణ విముక్తులు కావడంతోపాటు తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. 
 
మకరం: వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత మెళకువ చాలా అవసరం. సంతానం పై చదువులకోసం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఆస్తి పంపకాలలో పెద్దల తీరు మిమ్ములను ఇరకాటంలో పెట్టవచ్చు. 
 
కుంభం: పెద్దల గురించి ఆందోళన చెందుతారు. దైవ, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. కుటుంబంలో ప్రశాంతత, ప్రేమానుబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులు అధికారులకు విలువైన బహుమతులు అందించి ప్రసన్నం చేసుకుంటారు. స్త్రీల ప్రతిబాపాటలవాలకు సంఘంలో గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
మీనం: ఉద్యోగస్తులు అధికారులతో సాన్నిత్యం నెలకొంటుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రముఖుల ఇంటర్వ్యూకోసం పడిగాపులు తప్పవు. వ్యవహార ఒప్పందాల్లో కచ్చితంగా ఉండాలి. నూతన వ్యాపారాలు, వృత్తులు, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకోవడానికి కష్టపడాలి. స్త్రీలకు నాణ్యత ధరల పట్ల ఏకాగ్రత ముఖ్యం.