బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 19 అక్టోబరు 2018 (10:01 IST)

19-10-2018 శుక్రవారం మీ రాశిఫలితాలు - ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది..

మేషం: మీ సంతానం వివాహ, విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. స్త్రీల వాక్‌చాతుర్యం, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు ఊహించన చికాకులు ఎదురవుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. దైవ కార్యాలు, దీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం: ఆస్తి వ్యవహారాల్లో సోదరులతో విభేదిస్తారు. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. ఊహించని ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబీకులతో పలు విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. స్త్రీలకు స్కీములు, ప్రకటనల పట్ల అవగాహన అవసరం.    
 
మిధునం: ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ముఖ్యమని గమనించండి. నిరుద్యోగులు ఇంటర్వ్యూ లేఖలు అందుకుంటారు. గృహంలో మార్పులు, చేర్పులు చేపడతారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు.   
 
కర్కాటకం: కొత్తగా చేపట్టి వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. స్పెక్యులేషన్ రంగాలవారికి సామాన్యం. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు, టెండర్ల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. బంధువుల నుండి ఒత్తిడి ఎదుర్కుంటారు. ఒక శుభకార్యం చేయాలనే ఆలోచన స్పురిస్తుంది. 
 
సింహం: విద్యార్థినుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకోవలసి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. మీ యత్నాలకు సన్నిహితుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ వహించండి. 
 
కన్య: ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. సంబంధించిన విషయాల్లో పెద్దలను సంప్రదించడం మంచిది. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది.  
 
తుల: ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా పనిభారం అధికమవుతుంది. ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు, ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వలన చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.     
 
వృశ్చికం: బ్యాంకింగ్ వ్యవహారాలలో అతిగా వ్యవహరించడం వలన దీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్మాణాత్మక పనులో పనివారితో లౌక్యం అవసరం. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. రుణం కొంత మెుత్తం తీర్చడంతో ఒత్తిడి నుండి కుదుటపడుతారు. కుటుంబీకుల ఆరోగ్య విషయంలో ఏకాగ్రత వహించండి.   
 
ధనస్సు: విద్యార్థులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. కళాకారులకు, సినిమా రంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. ఐరన్, ఆటోమోబైల్, మెకానికల్ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.  
 
మకరం: ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. విద్యార్థులలో ఏకాగ్రత లోపం వలన ఒత్తిడి, మందలింపులు తప్పవు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు అన్ని విధాలా కలిగిరాగలదు.  
 
కుంభం: ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. అసాధ్యమనుకున్న వ్యవహారం సునాయసంగా సానుకూలమవుతుంది. మిత్రులకు మీ సమర్థతమై నమ్మకం ఏర్పడుతుంది. గత కొంత కాలంగా పడుతున్న అవస్థలు, చికాకులు తొలగిపోగలవు. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. 
 
మీనం: కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. సోదరీ, సోదరులతో అవగాహన కుదరదు. అకాలభోజనం, శారీరక శ్రమ వలన ఆరోగ్యం మందగిస్తుంది. రేషన్ డీలర్లకు అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది.