ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : ఆదివారం, 14 అక్టోబరు 2018 (09:53 IST)

14-10-2018 ఆదివారం దినఫలాలు - ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగానే...

మేషం: సహోద్యోగులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలపై ఆసక్తి మరింత పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. 
 
వృషభం: ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగానే ఉంటాయి. ఏజెంట్లు, బ్రోకర్లు, కలెక్షన్ ఏజెంట్లకు శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వాహనం నిదానంగా నడపండి. కుటుంబీకులలో మార్పు మీకెంతో ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలు, పుస్తక పఠనంతో కాలక్షేమం చేస్తారు. అందరితో వీలైనంత క్లుప్తంగా మాట్లాడండి.      
 
మిధునం: ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. వృత్తుల్లో వారికి శుభదాయకం. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా సమయానికి పూర్తికాగలవు. పారిశ్రామిక వేత్తలకు, కళ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. అవివాహితులకు శుభదాయకం. స్త్రీలకు ఆరోగ్యంలో సంతృప్తికానరాదు.  
 
కర్కాటకం: ప్రేమికుల మధ్య అపోహలు తొలగిపోగలవు. రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు. నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. మీ ఆశయసాధనకు ఉన్నతస్థాయి వ్యక్తులు సహకారం లభిస్తుంది. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన కొంతకాలం వాయిదా వేయడం మంచిది. 
 
సింహం:  ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రైవేటు రంగాల్లో వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. పుణ్య కార్యలలో చురుకుగా వ్యవహరిస్తారు. నిర్వహణ లోపం వలన వ్యాపార రంగంలోని వారికి సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. కుటుంబీకులతో కలిగి విందు, వినోదాలలో పాల్గొంటారు. 
 
కన్య: ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపార రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రేమికుల మధ్య ఎడబాట్లు తప్పవు. ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.  
 
తుల: స్త్రీలకు అధికశ్రమ, ఒత్తిడి వలన ఆరోగ్యం మందగిస్తుంది. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు విస్తరిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి సదవకాశాలు లభిస్తాయి.  
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో వారికి అనుకోని అభివృద్ధి కానవస్తుంది. ప్రయాణాలు అనుకూలం. స్త్రీలు కళాత్మక పోటీలు, టీవీ కార్యక్రమాల్లో రాణిస్తారు. అందరితో కలుపుగోలుగా మెలిగి మన్ననలు పొందుతారు. బంధువులు మీ నుండి పెద్దమెుత్తంలో ధనసహాయం అర్ధిస్తారు.   
 
ధనస్సు: ఆర్థిక కార్యకలాపాలలో మెళకువ అవసరం. మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకై చేయు యత్నాలు వాయిదాపడుతాయి. స్పెక్యులేషన్ లాభదాయకం. ప్రింటింగ్, స్టేషనరీ, ఫాన్సీ, కిరాణా వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు తక్కువగా ఉంటాయి. 
 
మకరం: భాగస్వామ్యుల నుండి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. స్త్రీలు, క్రీడా, ఇతర పోటీల్లో రాణిస్తారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి అవకాశాల కోసం యత్నించాలి. మీ అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆకస్మికంగా ఖర్చులు పెరుగుతాయి. వృత్తిపరంగా ఎదుర్కుంటున్న ఆటంకాలు క్రమంగా తొలగిపోగలవు.  
 
కుంభం: రాజకీయనాయకులు సభలు, సన్మానాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. అవగాహన లేని విషయాలు, చేతకాని పనులకు దూరంగా ఉండడం మంచిది.  
 
మీనం: స్త్రీలు దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. ప్రేమికుల మధ్య అనుమానాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తికాగలవు. రావలసిన మెుండిబాకీలు సైతం వసూలు కాగలవు. నూతన పరిచయాలు మీ ఉన్నతికి, పురోభివృద్ధికి తోడ్పడుతాయి.