బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (08:19 IST)

20-12-2018 గురువారం దినఫలాలు - రుణాలు, చేబదుళ్లు తేలికగా...

మేషం: పొదుపు పథకాల ధనం ముందుగానే తీసుకోవలసి వస్తుంది. పనులు ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు. ఆకస్మిక ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి సలహా పాటించడం వలన మేలే జరుగుతుంది. అనవసర విషయాల్లో జోక్యం వలన చిక్కులు తప్పవు. అధికారుల ఆగ్రహావేశాలు మనస్థాపం కలిగిస్తాయి. 
 
వృషభం: వ్యాపారాల్లో స్వల్ప లాభాలు, అనుభవం గడిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వృత్తుల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కోర్టు, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. మీ యత్నాలకు సహాయ సహకారాలు లభిస్తాయి. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. 
 
మిధునం: ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు జరిమానాలు, చికాకులు తప్పవు. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక విషయాలు, నచ్చిన వ్యక్తులతో కాలక్షేమం చేయండి. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే సూచనలున్నాయి. అధికారులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండాలి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి, ప్రజా సంబంధాలు విస్తరిస్తాయి.  
 
కర్కాటకం: ఉద్యోగస్తులకు సహోద్యోగులు అన్ని విధాల సహకరిస్తారు. రుణాలు, చేబదుళ్లు తేలికగా లభిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం ఉత్తమం. కోర్టు వ్యాజ్యాలు, కేసులు ఉపసంహరించుకుంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం తలపెడతారు. 
 
సింహం: ఇతరుల సంభాషణ మీ గురించేనన్న అనుమానంతో సతమతమవుతారు. తలపెట్టిన పనులపై ఏమాత్రం ఆసక్తి ఉండదు. మిమ్ములను కలవరపరిచిన సంఘటన తేలికగా సమసిపోతుంది. వ్యాపారాలు, ప్రాజక్టులకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. ఆపద సమయంలో అయిన వారు అండగా నిలబడుతారు.  
 
కన్య: ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు క్లయింట్‌లతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రిటైర్డు ఉద్యోగస్తులకు గ్రాట్యూటీ, ఇతరత్రా రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. ఎదుటివారికి మీపై ఉన్న అనుమానాలు, అపోహలు తొలగిపోగలవు. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.   
 
తుల: వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. కోర్టు వ్యవహారాలలో మెళకువ చాలా అవసరం. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. ఎటువంటి సమస్య ఎదురైనా మీ ధైర్యం చెక్కు చెదరదు. అసందర్భ సంభాషణ, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం వలన చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
వృశ్చికం: రాజీమార్గంతోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. తలపెట్టిన పనుల్లో ఏకాగ్రత లోపం, మతిమరుపు ఇబ్బందులకు దారితీస్తుంది. నిస్తేజం వీడి ఇంటర్వ్యూలకు హాజరవ్వండి. కోర్టు, స్థల వివాదాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. అధికారులకు అదనపు బాధ్యతలు, స్థానచలనం వంటి మార్పులున్నాయి.  
 
ధనస్సు: వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ఆటుపోట్లు తప్పవు. కొంతమంది తమ తప్పిదాలను మిమ్ములను బాధ్యులు చేసేందుకు యత్నిస్తారు. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. మీకందిన కరెన్సీ నోట్లను పరిశీలించుకోవడం ఉత్తమం. సభ్యత్వాలు, పదవులు స్వీకరిస్తారు.  
 
మకరం: ఉద్యోగస్తులకు బాధ్యతల నుండి విముక్తి, హోదా పెరిగే సూచనలున్నాయి. పనులు సవ్యంగా సాగక విసుగు చెందుతారు. భాగస్వామికి చర్చలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం ఆశించినంతగా ఉండదు. పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలుంటాయి.     
 
కుంభం: పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత, పునఃపరిశీలన ప్రధానం. స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. మీ పనులు, కార్యక్రమాలు అనుకున్నంత సజావుగా సాగవు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టం, ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. రాబోయే ఖర్చులకు తగినట్టుగా ఆదాయం సమకూర్చుకుంటారు.   
 
మీనం: మీ శ్రీమతి అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి యత్నించండి. దూరప్రయాణాలు, బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. నిరుద్యోగులు ఉపాధి పథకాలు, తాత్కాలిక ఉద్యోగంలో స్థిరపడతారు. చెక్కుల జారీ, నగదు చెల్లింపులలో జాగ్రత్త అవసరం. వితండ వాదాలు, వివాదాలకు దూరంగా ఉండాలి.