ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 18 డిశెంబరు 2018 (09:41 IST)

18-12-2018 ఈ రోజు మీ రాశి ఫలితాలు ఇలా వున్నాయ్... వైకుంఠ ఏకాదశి...

మేషం : కాంట్రాక్టర్లు పై అధికారులతో ఏకీభవించలేకపోతారు. మీ యత్నాలకు సన్నిహితులు అండగా నిలుస్తారు. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వృత్తి, వ్యాపారస్తులకు సంతృప్తి, పురోభివృద్ధి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, పానీయ, ఆల్కహాలు వ్యాపారస్తులకు ఆశాజనకం.
 
వృషభం : కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. నూతన ఒప్పందాలు వాయిదా పడతాయి. ప్రేమికులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్థులలో నిశ్చింత చోటుచేసుకుంటుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభం అవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు.
 
మిథునం : రచయితలకు, పత్రికా రంగంలోని వారికి పురోభివృద్ధి. సహకార సంఘాల్లోని వారికి, ప్రైవేటు సంస్థలలోని వారికి పై అధికారులతో ఏకీభావం కుదరదు. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికం అవుతున్నారని గమనించండి. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు శ్రమాధిక్యత కానవచ్చినా సత్ఫలితాలు పొందగలుగుతారు. ధన వ్యయం చేస్తారు.
 
కర్కాటకం : ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం, ఆలోచనలు స్ఫురిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాత పరీక్షలలో మెలకువ, ఏకాగ్రత అవసరం. శస్త్ర చికిత్స చేయునప్పుడు వైద్యులకు మెలకువ అవసరం.
 
సింహం : నూతన వ్యక్తులతో అతిగా వ్యవహరించటంవల్ల మాటపడాల్సి వస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సమస్యలు తలెత్తుతాయి. అప్పడప్పుడు పెద్దల ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.
 
కన్య : రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడంవల్ల దేంట్లోనూ ఏకాగ్రత వహించలేరు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి చికాకులు తప్పవు. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి పెరుగుతుంది. చేతి వృత్తుల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి.
 
తుల : స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ప్రముఖులతో సంప్రదింపులు జరపుతారు. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ అవసరం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఖర్చులు రాబడికి తగినట్లుగానే ఉంటాయి.
 
వృశ్చికం : ఆర్థిక విషయాలలో సంతృప్తి కానవస్తుంది. వ్యాపార రంగాల్లోని వారికి అధికారులతో సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడతాయి.
 
ధనస్సు : విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగానీ చేపట్టిన పనులు పూర్తి కావు. ఖర్చులు అంతగా లేకున్నా ధన వ్యయం విషయంలో మెలకువ వహించండి. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహనకు వస్తారు. ఉద్యోగస్తులు శక్తి వంచన లేకుండా అధికారులను మెప్పిస్తారు.
 
మకరం : సన్నిహితులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మిత్రుల సహకారంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
కుంభం : లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపించుకుంటారు. మీ యత్నాలకు అన్నివిధాలా సహకరిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో జాగ్రత్త వహించండి. స్త్రీలు అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ వహించండి. మిమ్మల్ని పొగిడే వ్యక్తులకు దూరంగా ఉండండి.
 
మీనం : ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. బంధువుల రాకతో అసౌకర్యానికి లోనవుతారు. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలను విడనాడి విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. హామీలు, మధ్యవర్తిత్వాలవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలతలుంటాయి.