బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (08:47 IST)

17-12-2018 సోమవారం దినఫలాలు - మీ జీవిత భాగస్వామి వైఖరి...

మేషం: ఉద్యోగం మాని వ్యాపారాలు చేయడం మంచి కాదని గమనించండి. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరంచేస్తుంది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటర్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. స్త్రీలపై బంధువుల మాటలు తీవ్ర ప్రభావం చూపుతాయి.  
 
వృషభం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. మునుముందు ఖర్చులు అధికంగా ఉంటాయి. ధనవ్యయంలో మితం పాటించండి. సన్నిహితుల సలహాలు, హితోక్కులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. మీ అతిచనువును ఇతరులు అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.  
 
మిధునం: మీ సంతానంపై చదువుల విషయాన్ని వారి ఇష్టానికి వదిలేయడం ఉత్తమం. వృత్తుల వారికి పరిచయాలు, గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయులకు కార్యక్రమాలలో ఒత్తిడి అధికమవుతుంది.  
 
కర్కాటకం: ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు ఆలస్యంగా గుర్తిస్తారు. ఒక మంచి చేశామన్న భావం సంతోషం కలిగిస్తుంది. ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడుతాయి. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.  
 
సింహం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. గృహనిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. దూరప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. 
 
కన్య: బ్యాంకుల నుండి పెద్దమెుత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ధాన, ధర్మాలు చేసి మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు.   
 
తుల: ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కుంటారు. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఆత్మీయుని రాక చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. 
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. హోటర్ తినుబండ, క్యాటరింగ్ రంగాల్లో వారికి కలిగివచ్చేకాలం. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండడం క్షేమదాయకంగా ఉంటుంది.  
 
ధనస్సు: కొబ్బరి, పండ్లు, పూలు, కూరల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. శారీరక శ్రమ, అకాల భోజనం వలన ఆరోగ్యం మందగిస్తుంది. పాత వస్తువులను కొనడం వలన సమస్యలు తలెత్తుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశీ యత్నాల్లో స్వల్ప చికాకులు, ఆటంకాలు వంటివి ఎదుర్కుంటారు.   
 
మకరం: తలపెట్టిన పనిలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తిగా పూర్తిచేస్తారు. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. అయిన వారి కోసం తాపత్రయపడుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దైవ, సేవా, పుణ్య కార్యాలలో నిమగ్నమవుతారు. మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.     
 
కుంభం: సిమెంటు, ఇసుక వ్యాపారులకు పురోభివృద్ధి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఖర్చులు అధికమవుతాయి. కొంతమంది మిమ్ములను తప్పత్రోవ పట్టించి లబ్ధి పొందటానికి యత్నిస్తారు. దంపతుల మధ్య అరమరికలు, దాపరికం కూడదు. బాధ లాంటి వాటిని వదలి సందోషమైన జీవితాన్ని గడపండి.    
 
మీనం: ఉద్యోగ ప్రకటనలపై అవగాహన ముఖ్యం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మితిమీరిన ఆలోచనులు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపార విషయాల యందు జాయింట్ సమస్యలు తప్పవు.