ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (09:04 IST)

22-10-2018 సోమవారం దినఫలాలు - ఆపద సమయంలో బంధువులు..

మేషం: మీ అభిరుచి, ఆశయాలకు సంబంధించిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది కాదు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం దిశగా మీ ఆలోచనలు ఉంటాయి.
 
వృషభం: స్త్రీలకు ప్రకటనలు, స్కీములు పట్ల అవగాహన అవసరం. ప్రింటింగ్ రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి. కొబ్బరి, పండ్లు, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. సంఘంలో మీకు పేరు, ప్రఖ్యాతలు పెరుగును. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి.  
 
మిధునం: ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన సమస్యలు తలెత్త ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. చిరు వ్యాపారులకు లాభదాయకం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సోదరి సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహానం ఎదుర్కుంటారు. పొట్ట, నరాలకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి.     
 
కర్కాటకం: ధనం ఎంత వస్తున్నా ఏ మాత్రం నిల్వ చేయలేకపోతారు. ప్రతి చిన్ విషయానికి ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. విద్యుత్, ఎ.సి. కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి లభిస్తుంది. రాబడికి మించిన ఖర్చులుండడంతో ఒడుదుడుకులు తప్పవు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఆశాభంగం తప్పదు. 
 
సింహం: మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవచ్చును. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడుకుండా స్వయంకృషిపైనే ఆధారపడడం శ్రేయస్కరం. స్త్రీలకు ఆరోగ్యం, ధనవ్యయంలోను మెళకువ అవసరం. 
 
కన్య: మీ లక్ష్య సిద్ధికి నింతర కృషి పట్టుదల అవసరమని గమనించండి. ఆధ్యాత్మిక చింతన, వ్యాపకాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభవార్తలు వింటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
తుల: వస్త్ర, బంగారం, వెండి, లోహ పనివారలకు పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తుల శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. విద్యార్థినుల ఆలోచనులు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్స్‌లు మంజూరు కాగలవు.        
 
వృశ్చికం: లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టర్లకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి ఆశాజనకం. కొబ్బరి, పండ్లు, పూల, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది.  
 
ధనస్సు: విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సన్నిహితుల కోసం ధనం విరివిగా వ్యయంచేస్తారు. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. 
 
మకరం: భాగస్వామిక, సొంత వ్యాపారాలు ఆశాజనకం. నూతన పెట్టుబడులు, ప్రాజెక్టులు, ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, ఇతరత్రా సమస్యలు అధికం. సంఘంలో గుర్తింపు పొందుతారు. పత్రికా సంస్థలలోని వారికి పునఃపరిశీలన, ఏకాగ్రత ముఖ్యం. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి.  
 
కుంభం: రవాణా రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు. చిరకాలంగా వేధిస్తున్నా సమస్య పరిష్కారమవుతుంది. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాతమిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తిక వస్తాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. ప్రయాణాల్లో చికాకులు తప్పవు.  
 
మీనం: ఆర్థికలావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు వాయిదాపడుతాయి. నిరుద్యోగులకు ఆశాజనకం. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.