మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : ఆదివారం, 21 అక్టోబరు 2018 (09:12 IST)

21-10-2018 ఆదివారం దినఫలాలు - చిన్ననాటి వ్యక్తులను...

మేషం: స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. పొట్ట, నరాలకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. విలేఖరులకు, ఎలక్ట్రానిక్ మీడియా రంగాలవారికి చికాకులు తప్పవు. విద్యార్థులు క్రీడలు, క్విజ్ ఇతర పోటీల్లో రాణిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 
 
వృషభం: రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టమ్మీద పూర్తిచేస్తారు. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. మిత్రులుగా మారి సహకారం అందిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు.    
 
మిధునం: ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. మీడియా రంగాలవారికి పనిభారం అధికమవుతుంది. మిత్రుల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. విందులలో పరిమితి పాటించడం చాలా అవసరం. ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు.  
 
కర్కాటకం: వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో పర్యటనలు, పర్వవేక్షణలలో పాల్గొంటారు. దూరప్రయాణాలలో వస్తువులు పట్ల మెళకువ అవసరం. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. 
 
సింహం: స్త్రీలు అలంకారాలు, విలాసవస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.  
 
కన్య: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పరీస్త్రీలతో అధికంగా సంభాషించడం మంచిది కాదు. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
తుల: స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. వాహనం ఇతరుకు ఇచ్చి సమస్యలను తెచ్చుకుంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత రుణాలు తీరుస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తిచేస్తారు.        
 
వృశ్చికం: రేపటి కార్యక్రమాల గురించి ఈ రోజే ఆలోచించి క్రియారూపంలో పెట్టండి. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వలన మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. కంప్యూటర్ రంగాలవారికి పురోభివృద్ధి. న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తారు. విద్యుత్ రంగాలవారికి పనిలో ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. 
 
ధనస్సు: స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి సమస్యలను తెచ్చుకుంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత రుణాలు తీరుస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. 
 
మకరం: ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. ఆడిటర్లకు, అకౌంట్క్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. కీలకమైన వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాలవారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
కుంభం: కళా సాంస్కృతిక రంగాలవారు లక్ష్య సాధనకు శ్రమించాలి. గృహంలో మార్పులు, చేర్పులు వలన రవాణా రంగాల వారికి చికాకులు అధికం. స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. సోదరీసోదరులతో అవగాహన కుదరదు. వ్యవసాయదారులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానవచ్చును.  
 
మీనం: వ్యాపారాల్లో ఒడిదుడుకులు, స్వల్ప నష్టాలు ఎదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి వంటివి అధికమవుతాయి. తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తలెత్తుతాయి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం.