శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : ఆదివారం, 30 జూన్ 2019 (07:39 IST)

30-06-2019 ఆదివారం మీ రాశిఫలాలు - దంపతుల మధ్య ప్రేమానురాగాలు..

మేషం : కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు కొనసాగుతాయి. ఆంతరంగిక వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ రంగాలలోని వారికి పురోభివృద్ధి. కిరాణా, ఫ్యాన్సీ, వ్యాపారులకు కలసివచ్చే కాలం.
 
వృషభం : ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. ప్రముఖులతో పరిచయాలు, తరచూ విందులు లాంటి శుభ సంకేతాలున్నాయి. స్త్రీలు తొందరపాటు నిర్ణయాలవల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. చేతి వృత్తుల వారికి కలసి రాగలదు. స్థిర చరాస్తుల విషయంలో కుటుంబీకుల మధ్య ఏకీభావం కుదరదు.
 
మిథునం : దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. పాత మిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అచ్చుతప్పులు పడటంవల్ల మాటపడక తప్పదు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.
 
కర్కాటకం : వస్త్ర, వెండి, బంగారు, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థిక స్థికి ఆటంకంగా నిలుస్తాయి. మీ పాత సమస్యలు ఒకంతట తేలకపోవటంతో నిరుత్సాహానికి గురవుతారు. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాత పరీక్షల్లో మెలకువ, ఏకాగ్రత అవసరం.
 
సింహం : ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో పనివారితో లౌక్యం అవసరం. స్త్రీలకు సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. విద్యార్థులు క్రీడలు, క్విజ్ లాంటి పోటీలలో రాణిస్తారు.
 
కన్య : ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరగటంతో శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం లాంటి చికాకులు తప్పవు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు గృహోపకరణాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ రంగాలలోని వారికి పురోభివృద్ధి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
తుల : మీ ఆర్థిక స్థితికి అవరోధంగా నిలుస్తాయి. స్త్రీలు అపరిచితులవల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఉమ్మడి వ్యాపారాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. రిప్రజెంటేటివ్‌లు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి.
 
వృశ్చికం : చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఇప్పటిదాకా మిమ్మల్ని తక్కువ అంచనా వేసినవారు మీ సహాయ సహకారాలు అర్థిస్తారు. ఓర్పుతో వ్యవహరించటంవల్ల నిరుత్సాహం, ఆవేదనకు లోనవుతారు.
 
ధనస్సు : సన్నిహితులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. మందులు, ఎరువులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలసివచ్చే కాలం. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయండి. రుణ విముక్తులు కావటంతో మానసికంగా కుదుట పడతారు. కాంట్రాక్టర్లకు చేతిలో పని పూర్తి కావటంతో ఒకింత కుదుట పడతారు.
 
మకరం : రాజకీయాలలోని వారికి కార్యకర్తలవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యుల రాకపోకలు అధికం అవుతాయి. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. స్త్రీలకు పనివారలతో చికాకులు ఎదురవుతాయి. ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలపట్ల ఏకాగ్రత వహించాల్సి వస్తుంది.
 
కుంభం : స్త్రీలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపట్ల ధ్యాస వహిస్తారు. మీ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయటంతో భంగపాటుకు గురికాక తప్పదు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్ రంగాల్లోని వారికి ఒత్తిడి తప్పదు. దూర ప్రయాణాలలో మెలకువ వహించండి. విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి.
 
మీనం : ప్రముఖులతో కలిసి సంప్రదింపులు జరపుతారు. తొందరపడి సంభాషించటంవల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. దైవ కార్యక్రమాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారులకు ఆశాజనకం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెలకువ అవసరం.