శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (13:22 IST)

25-06-2019 మంగళవారం మీ రాశిఫలాలు - కార్తికేయుడిని పూజించినా...

మేషం : వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దూర ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నులై ఉంటారు. పండ్లు, పూల, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రైవేటు విద్యా సంస్థల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. స్థిరచరాస్తుల విక్రయంలో పునరాలోచన మంచిది. 
 
వృషభం : నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి నుంచి చికాకులు ఎదురవుతాయి. ఇతరుల సహాయం అర్థించడం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. 
 
మిథునం : కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. బంధువులతో విభేదాలు తొలగి రాకపోకలు అధికమవుతాయి. గృహ నిర్మాణాల్లో జాప్యం వల్ల నిరుత్సాహం తప్పదు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. మీ అలవాట్లు బలహీనతలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులకు అధికారిక పర్యటనలు, బాధ్యతలు అధికమవుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. స్త్రీలలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. 
 
సింహం : స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే సంఘటనలెదురవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరులకు మేలు చేసేందుకు యత్నించండి. 
 
కన్య : అకాల భోజనం, శారీరక శ్రమవల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. స్టేషనరీ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికం. దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులకు అధికారుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
తుల : వృత్తుల వారికి పురోభివృద్ధి. గుర్తింపు, సదావకాశాలు లభిస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు తలెత్తినా క్రమంగా సమసిపోగలవు. రావలసిన ధనం అందడంతో పొదుపు పథకాల దిశగా ఆలోచనలు సాగిస్తారు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. దూర ప్రయాణాల గురించి ఆందోళన చెందుతారు. 
 
వృశ్చికం : సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకెంతో శుభం చేకూరుతుందని గమనించండి. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకుంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
ధనస్సు : ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. పాత మిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో మెలకువ వహించండి. విద్యార్థులు వాహనం నడుపునపుడు ఏకాగ్రత ముఖ్యం. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 
 
మకరం : ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికం. బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో మెలకువ అవసరం. స్త్రీలకు స్వీయ అర్జనపట్ల ఆసక్తి ఏర్పడుతుంది. దూర ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నులైవుంటారు. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తారు. 
 
కుంభం : స్త్రీలపై చెప్పుడు మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. వాహన నడుపునపుడు మెళకువ అవసరం. మీ జీవిత భాగస్వామితో సున్నితంగా వ్యవహరించండి. దైవ, సేవ పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మీనం : ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దూర ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నులై ఉంటారు. నూతన దంపతుల మధ్య అవగాహన, ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. వృత్తులవారికి గుర్తింపు, శ్రమకు తగిన ఆదాయం లభిస్తాయి. పెద్ద మొత్తం రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం.