శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2019 (10:51 IST)

21-6-2019 శుక్రవారం మీ రాశి ఫలితాలు.. అసూయపడే ఆస్కారం వుంది జాగ్రత్త

మేషం: ఉద్యోగస్తులు పై అధికారులతో మితంగా సంభాషించడం మంచిది. వైద్యులకు శస్త్ర చికిత్స సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. రాజీ మార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇతరులకు మేలు చేసినా విమర్శలు తప్పవు. మీ శ్రమకు లభించిన ప్రతిఫలంతో సంతృప్తి చెందాల్సి వుంటుంది. 
 
వృషభం: ఉమ్మడి, ఆర్థిక వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రుల వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. 
 
మిథునం: సంతానం పై చదువులపై శ్రద్ధ వహిస్తారు. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు శుభదాయకం. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఏ విషయాన్ని తేలికగా కొట్టిపారేయకండి. 
 
కర్కాటకం: బంగారం, వెండి, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు విద్యార్థుల అత్యుత్సాహం వల్ల ఊహించని చికాకులు తప్పవు. స్త్రీల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించండి. శత్రువులు మిత్రులుగా మారుతారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారం సంతృప్తినిస్తాయి.
 
సింహం: బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. కొనుగోళ్ల విషయంలో ఏకాగ్రత వహించండి. అధికారులకు తనిఖీలు, పర్యటనలతో తీరిక వుండదు. ఉద్యోగస్తులకు ఒక అవకాశం చేతిదాకా వచ్చి వెనక్కిపోయే ఆస్కారం వుంది. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆశాజనకం. యాదృచ్ఛికంగా తప్పిదాలు దొర్లే ఆస్కారం వుంది. 
 
కన్య: ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. శస్త్రచికిత్సల సమయంలో డాక్టర్లకు ఏకాగ్రత చాలా అవసరం. ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి చికాకులు వంటివి తలెత్తుతాయి. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు.
 
తుల: పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలవడం కష్టమే. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పత్రిక, వార్తా మీడియా వారికి ఊహించని సమస్యలెదురవుతాయి. 
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, స్వశక్తిపై జీవించాలనే పట్టుదల అధికమవుతాయి. చేపట్టిన పునులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలు అనుకూలించకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు.
 
ధనస్సు: పెద్దల గురించి ఆందోళన చెందుచారు. ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. బంధువులు మీ స్థితిగతులను చూసి అసూయపడే ఆస్కారం వుంది జాగ్రత్త వహించండి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. 
 
మకరం: బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఖర్చులు అధికమైనా మీ ఆర్థికస్థితికి ఏమాత్రం లోటుండదు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు అభ్యంతరాలు, చికాకులు అధికం. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం నిరుత్సాహం కలిగిస్తుంది. వృత్తి, ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 
 
కుంభం: నిరుద్యోగులు బోగస్ ప్రకటనల పట్ల నష్టపోయే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక సమావేశాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. 
 
మీనం: కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. మీ సంతానం వైఖరి ఆందోళన కలిగిస్తుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని సందర్భాల్లో మీ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతాయి.