శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 19 జూన్ 2019 (12:39 IST)

బుధవారం (19-06-2019) రాశిఫలాలు - ఆర్థిక విషయాల్లో...

వృషభం : ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకుంటారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. సినిమా రంగంలో వారికి చికాకులు అధికం అవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. మనసులోని మాటను వ్యక్తపరచటానికి సరైన సమయం కాదు. రుణం దొరుకుతుంది.
 
మిథునం : ఆర్థిక విషయాల్లో సహోద్యోగుల సహకారం అందుతుంది. విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలక్టవుతారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. రాజకీయాల్లోని వారికి తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువుల రాకతో ఆకస్మిక ఖర్చులు అధికం.
 
కర్కాటకం : కళాకారులకు, సినిమా రంగం వారికి అనుకూలమైన సమయం. విందు, వినోదాలలో పాల్గొంటారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసే వారు అధికం అవుతారు. స్త్రీలకు గుర్తింపు రాణింపు లభిస్తుంది. దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరమని గమనించండి.
 
సింహం : మీకు సంఘంలో మంచిపేరు, ఖ్యాతి లభిస్తుంది. పాత మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. ఊహించని ఖర్చుల వల్ల ఆందోళన చెందుతారు. రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. సోదరీ, సోదరుల విషయంలో చిక్కులు వస్తాయి. చేపట్టిన పనులు హడావుడిగా ముగిస్తారు.
 
కన్య : చిన్నారులపై అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆధ్యాత్మిక, దైవ, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ మాటకు విలువ కొంత తగ్గును. కొంతమంది మీ నుంచి ధనసహాయం లేక ఇతరత్రా సాయం అర్ధిస్తారు. వాహనచోదకులకు చికాకులు తప్పవు. ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు.
 
తుల : గృహాలంకరణ వస్తువులు సమకూర్చుకుంటారు. వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. చేసే పనికి ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. వృత్తిపరమైన సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. బంధువుల రాకతో కుటుంబంలోని వారు ఉల్లాసంగా ఉంటారు. స్త్రీలకు శుభదాయకం.
 
వృశ్చికం : కుటుంబ సభ్యుల మధ్య ఆదరాభిమానాలు అధికం అవుతాయి. పాత వస్తువులను కొని సమస్యలను కొని తెచ్చుకోకండి. కిరణా, ఫ్యాన్సీ వ్యాపరస్తులు అధిక ఒత్తిడిని, చికాకువు ఎదుర్కొనవలసివస్తుంది. ప్రముఖులతో, పెద్దలతో అభిప్రాయాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి.
 
ధనస్సు : స్త్రీలకు నూతన వస్తు కొనుగోల్ళ పట్ల ఆసక్తి పెరుగుతుంది. సానుకూలమైన మార్పుతోనే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుంది. ప్రత్యర్థుల కదలిక పట్ల ఓ కన్నేసి ఉంచండి. గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కంటారు.
 
మకరం : కొంత మంది సూటీపోటీ మాటల వల్ల మీరు మానసిక ఆందోళనకు గురవుతారు. చేతి వృత్తుల వారికి ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండకపోవచ్చు. కుటుంబంలోని ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
కుంభం :  తలపెట్టిన పనులలో కొన్ని అవరోధాలు ఎదుర్కొనక తప్పదు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. ఇతర దేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు కలిసిరాగలవు. క్రీడా రంగంలోని వారికి సంతృప్తి కానరాగలవు. షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం.
 
మీనం : మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మందులు, ఫ్యాన్సీ, రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు లాభదాయకం. రిప్రజెంటివ్‌లకు సదవకాశాలు లభిస్తాయి.