గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 15 జూన్ 2019 (17:28 IST)

15-06-2019 శనివారం మీ రాశి ఫలితాలు

మేషం: వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలు క్రమంగా సర్దుకుంటాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు స్థానచలనం సంభం. అధికారులకు ప్రముఖులతో సమస్యలు తప్పవు. పన్నులు, ఫీజులు సకాలంలో చెల్లిస్తారు. పొగడ్తలు, మొహమ్మాటాలకు దూరంగా వుండాలి. వాణిజ్య ఒప్పందాలు, నూతన పెట్టుబడులకు అనుకూలం. 
 
వృషభం: ఆహ్వానాలు, నోటీసులు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ విషయాలు, శ్రీమతి వైఖరి చికాకుపరుస్తాయి. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. 
 
మిథునం: ఉద్యోగస్తులకు ఆందోళన అధికం. పెద్దమొత్తం నగదుతో ప్రయాణం తగదు. విదేశాల్లో ఉన్నత చదువులకు అవకాశం లభిస్తుంది. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఏజెన్సీలు, లీజు, టెండర్లకు అనుకూలం.
 
కర్కాటకం: ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదే. మానసిక చికాకులు, ఆర్థిక ఇబ్బందులు క్రమంగా సర్దుకుంటాయి. ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. చిట్స్, ఫైనాన్స్, వ్యాపారుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణం సాఫీగా సాగుతుంది.
 
సింహం: మీ ప్రమేయంతో ఒక శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆరోగ్య రీత్యా స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సహోద్యోగులతో పాటు ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. 
 
కన్య: ఆర్థిక, వ్యాపార విషయాలను గోప్యంగా వుంచండి. నూతన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. కోర్టు వాయిదాలు చికాకు కలిగిస్తాయి. బ్యాంక్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. 
 
తుల: మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ, వ్యాపార ప్రకటనలపై అవగాహన ముఖ్యం. గుట్టుగా యత్నాలు సాగించండి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు అమలు చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. 
 
వృశ్చికం: ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. తలపెట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. టెండర్లు, ఏజెన్సీలు, లీజు పొడిగింపులకు అనుకూలం. వివాదాస్పద విషయాలకు దూరంగా వుండాలి. పెద్దల ఆరోగ్యం గురించి మానసికంగా ఆందోళన చెందుతారు.
 
ధనస్సు: విందులలో పరిమితి పాటించండి. బంధువులను కలుసుకుంటారు. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. పనులు, కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అభ్యంతరాలు, చికాకులు తప్పవు. రావలసిన ధనం అందుతుంది. 
 
మకరం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. స్త్రీలు శుభకార్యాల్లో ప్రముఖంగా పాల్గొంటారు.
 
కుంభం: ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. 
 
మీనం: ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. బాకీలు, ఇంటి అద్దెలు సౌమ్యంగా వసూలు చేసుకోవాలి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు అమలు చేస్తారు. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నాలు సాగించండి. ఉద్యోగస్తులకు పదోన్నతి, బదిలీ ఉత్తర్వులు అందుతాయి.