శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 18 జూన్ 2019 (11:09 IST)

మంగళవారం (18-06-2019) రాశిఫలాలు - ఉద్యోగుల అశ్రద్ధ - జాప్యం వల్ల..

మేషం : స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తుల తొందరపాటు చర్యలు, నిర్లక్ష్యం వల్ల అధికారులు కొత్త సమస్య లెదుర్తోవలసివస్తుంది. ఆత్మీయుల అతిధి మర్యాదలు సంతృప్తినిస్తాయి. దంపతులకు సంతాన ప్రాప్తి కలదు.
 
వృషభం : ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. వాతావరణంలోని మార్పువల్ల స్త్రీల ఆరోగ్యము మందగిస్తుంది. ఉద్యోగస్తులకు అశ్రద్ధ, ఆలస్యాల వల్ల మాటపడక తప్పదు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారస్తులకు శుభం, జయం చేకూరుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
 
మిథునం : రవాణా, ఎక్స్‌పోర్ట్ రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. సంతానం కోలం ధనం బాగా వెచ్చిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకున్నంత సంతృప్తి నివ్వవు. ఉద్యోగస్తుల ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది.
 
కర్కాటకం : బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. రాజకీయనాయకులకు ఇతరులతో సంభాషించినపుడు మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం చేయవలసి వస్తుంది. విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు.
 
సింహం : స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. వ్యాపార సంస్థల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది.
 
కన్య : ఎదుటివారితో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. ఆదాయ వ్యయాల విషయంలో ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులకు శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రయాణాల్లో ద్విచక్ర వాహనంపై ప్రయాణాలు మంచిదికాదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
 
తుల : ఉన్నతస్థాయి అధికారులు తమ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా మెలగవలసి ఉంటుంది. ఒక విలువైన వస్తువు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. సోదరీ, సోదరులతో పరస్పర అవగాహనాలోపం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. పారిశ్రామిక సంబంధ, బాంధవ్యాలు మెరుగవగలవు.
 
వృశ్చికం : కుటుంబీకుల విషయంలో నూతన పథకాలు వేస్తారు. విద్యార్థులు ఏకాగ్రత లోపం వలన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ప్రైవేట్ సంస్థల్లో వారికి బాధ్యతలు అధికం అవుతాయి. బంధు, మిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీ చిన్నారుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి.
 
ధనస్సు : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారు అధిక శ్రమ, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ఇతరుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన చికాకులు తలెత్తవచ్చు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి లాభదాయకం. స్త్రీలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విదేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
మకరం : సాంకేతిక విద్యలపై దృష్టి సారిస్తారు. ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టును అమలులోకి తీసుకువస్తారు. టెక్నికల్ రంగంలో ఉన్నవారికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. భాగస్వామ్య వ్యవహారాలు లాభాలను తెచ్చి పెడతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.
 
కుంభం : యాధృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. శ్రీమతి, శ్రీవారు మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తవచ్చు. కొబ్బరి, పూల, పండ్ల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
మీనం : నిర్మాణాత్మకమైన పనుల్లో చురుకుదనం కానవస్తుంది. వ్యాపారస్తులకు సమిష్టి కృషి వలన జయం. ఉద్యోగాలలో వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. మీ చుట్టు పక్కల వారితో సంభాషించేటప్పుడు మెళకువ వహించండి. ధ్యానం చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఆశాజనకం.