మేషం: వ్యాపారస్తులకు ప్రభుత్వ అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కొనవలసివస్తుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నముగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా వుండటం మంచిది. క్రయ విక్రయ రంగాల వారికి నూతన ఉత్సాహం కానవస్తుంది. ఆత్మీయులకు విలువైన బహుమతులు అందిస్తారు.
వృషభం: రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. చెల్లింపులు వాయిదా వేస్తారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. చేతివృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. వృత్తి వ్యాపారాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు.
మిథునం: ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం తగ్గుతుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ అవసరం. మిత్రుల సహకారంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. మీ శ్రీమతి మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. వీసా, పాస్‌పోర్టులకు సంబంధించిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు.
కర్కాటకం: నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. ఉమ్మడి నిధుల నిర్వహణలో మాటపడవలసివస్తుంది. విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాల గురించి తగాదాలు రావచ్చు.
సింహం: పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులే అనుకూలిస్తాయి, స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, విందు భోజనం, వస్త్రలాభం వంటి శుభ పరిణామాలు వుంటాయి. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశం వుంది.
కన్య: సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు లాభదాయకం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. రాతకోతలు, ప్రయాణాలు లాభించకపోవచ్చు. వ్యాపార విషయాల్లో ఏకాగ్రత అవసరం. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది.
తుల: స్తిరాస్తులు, వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. పై అధికారులు, ప్రముఖులతో వాగ్వివాదాలకు దిగకండి. కీలకమైన వ్యవహారాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. అనుకున్న కార్యాలు మధ్యలో ఆగిపోతాయి.
వృశ్చికం: రాజకీయనాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. వ్యాపారులకు పోటీ పెరగడంతో ఆశించినంత ఆర్థిక సంతృప్తి వుండదు. పొదుపు దిశగా ఆలోచిస్తారు.
ధనస్సు: ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. హామీలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన మంచిది. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధములు రావచ్చు. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.
మకరం: ఆస్తి వ్యవహారాల విషయంలో దాయాదుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వుంటుంది. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపోహలు చోటుచేసుకుంటాయి. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం.
కుంభం: భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. విద్యార్థినులు పట్టుదలతో శ్రమించినట్లైతే సత్ఫలితాలు సాధించగలరు. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. పత్రికా సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీ మూలకంగా కలహాలు, ఇతరత్ర చికాకులు ఎదురవుతాయి.
మీనం: రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. కోపంతో పనులు చక్కబెట్టలేరు. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. శాస్త్ర సాంకేతిక, కళ, క్రీడా రంగాలవారికి అనుకూలం.