సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 27 జూన్ 2019 (09:27 IST)

27-06-2019 గురువారం రాశిఫలాలు : సాయిబాబాను ఆరాధించడం మీకు శుభం....

మేషం : చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. పండ్లు, కొబ్బరి, పూలు, చల్లని పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. 
 
వృషభం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వృత్తుల వారికి నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ముఖ్యుల గురించి ధనం వెచ్చిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
మిథునం : గృహమునకు కావలసిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి సంతృప్తి కానవచ్చును. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రింటింగ్ రంగాలవారు అచ్చు తప్పులు పడుట వల్ల మాటపడవలసి వస్తుంది. మీ అభిప్రాయం సున్నితంగా వ్యక్తం చేయటం శ్రేయస్కరం. 
 
కర్కాటకం : ఎగుమతి, దిగుమతి వ్యాపారస్తులకు, జాయింట్ వ్యాపారులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులకు జాగ్రత్త అవసరం. స్త్రీలు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. 
 
సింహం : టెక్నికల్ కంప్యూటర్ రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు. సమావేశాలు, వేడుకల్లో ఖర్చులు అధికం. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుపటపడుతారు. వ్యాపారస్తులు ప్రభుత్వ అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
కన్య : ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచితుల పట్ల అప్రమత్తత అవసరం. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. 
 
తుల : ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనా మనశ్శాంతి లోపిస్తుంది. సోదరుల మధ్య చిన్న చిన్న కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. రవాణా రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. పత్రిక ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. కుటుంబ విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. 
 
వృశ్చికం : ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అనుకూలిస్తాయి. ప్రేమ విషయంలో కానీ, వృత్తిపరంగా కానీ ఓ త్యాగం చేయాల్సి వస్తుంది. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తప్పవు. సంగీత, సాహిత్య సదస్సులలో పాల్గొంటారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
ధనస్సు : కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. తోబుట్టువులతో వివాదాలు తలెత్తుతాయి. రవాణా రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. తాపి పనివారికి లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు క్రీడా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉమ్మడి వెంచర్లు, పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. 
 
మకరం : ఆర్థికాభివృద్ధికి కానవస్తుంది. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. స్త్రీలకు నడుం, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. అధికారులకు ఒత్తిడి, తనిఖీలు, పర్యటనలు అధికమవుతాయి. 
 
కుంభం : ఏదైనా అమ్మకానికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. సతీమసేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
మీనం : దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం వంటి శుభఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగిన నష్టాలు ఉండవు. వస్త్రాలు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.