శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 10 జులై 2019 (19:53 IST)

26-06-2019 బుధవారం మీ రాశి ఫలితాలు.. ప్రేమికులు అతిగా వ్యవహరించి?

మేషం: ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు అన్ని విధాలా కలిసిరాగలదు. ఒకానొక విషయంలో మీ కళత్ర మొండి వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. క్రయ విక్రయాలు ఆశించినంత సంతృప్తినీయ జాలవు. 
 
వృషభం: విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు. తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఇతరులకు పెద్ద ఎత్తున ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి వంటివి ఎదుర్కొంటారు.
 
మిథునం: ఆర్థికంగా మెరుగుపడుతారు. భాగస్వామిక వ్యాపారాల్లో మీ ఆధిపత్యానికి భంగం కలుగవచ్చు. బ్యాంక్ వ్యవహారాలతో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడం మంచిది కాదు. నూతన వస్తువులు వాహనాలు కొంటారు.
 
కర్కాటకం: పాడిపశువులు, పెంపుడు జంతువుల విషయంలో ఆందోళన చెందుతారు. విద్యార్థుల్లో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ ఆలోచనలు, పథకాలు క్రియారూపంలో పెట్టండి. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆందోళనలు వంటివి తలెత్తుతాయి. ప్రతి విషయంలోను మీదే పైచేయిగా వుంటుంది.
 
సింహం: భాగస్వామిక వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు, అధికారులకు మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. క్రీడ, కళాకారులకు ప్రోత్సాహకరం. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి కర్తవ్య నిర్వహణలో చిన్న చిన్న పొరపాట్లు జరిగే ఆస్కారం వుంది. సన్నిహితుల గురించి ఆందోళన చెందుతారు. 
 
కన్య: మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది. మెలకువ వహించండి. విద్యార్థులకు దూర ప్రాంతాల నుంచి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు.
 
తుల: వ్యాపారాలు ఆశించినంత లాభసాటిగా వుండవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో కొత్త ఉత్సాహాన్నిస్తాయి. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి నిరుత్సాహం వంటివి తలెత్తుతాయి. కుటుంబ అవసరాలు పెరగడంతో అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. గతంలో వాయిదా వేసిన పనులు పునః ప్రారంభిస్తారు.
 
వృశ్చికం: ప్రియతముల నుంచి ఒక సమాచారం గ్రహిస్తారు. మీరు చేయబోయే మంచి పని విషయంలో అనుమానాలు విడనాడి శ్రమించండి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. మీ యత్నాలకు సన్నిహితుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. 
 
ధనస్సు: రావలసిన ధనం అందడంతో కుదుటపడతారు. అనుకున్న పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశం వుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. ఆశిస్తున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశం వుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. 
 
మకరం: వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు లాభదాయకంగా వుంటుంది. ప్రేమికులకు చికాకులు అధికమవుతాయి. రుణాలు, పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత వుంటుంది. స్త్రీలకు అయినవారితో పట్టింపులెదుర్కొంటారు. పన్నులు, బీమా, బిల్లులు పరిష్కారమవుతాయి. 
 
కుంభం: ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ వుండదు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఉద్యోగస్తులు చిక్కుల్లో పడుతారు. ప్రముఖుల కోసం ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు బంధువర్గాలు, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
మీనం: స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కిరాగలవు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు స్థానమార్పిడికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి.