Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభోదయం... మీ రాశి ఫలితాలు 17-08-2017

మేషం : స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెళకువ వహించండి. మీ తెలివి తేటలకు వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. కష్ట సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంత

Written By raman
Updated: గురువారం, 17 ఆగస్టు 2017 (06:00 IST)
మేషం : స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెళకువ వహించండి. మీ తెలివి తేటలకు వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. కష్ట సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తి నివ్వగలదు. దూర ప్రయాణాలు అనుకూలం. నిరుద్యోగులకు నిరుత్సాహం, నిర్లిప్తత తప్పవు.
 
వృషభం : ఉద్యోగస్తులకు ప్రైవేట్ సంస్థల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. వాగ్వివాదాలకు, పంతాలకు పోకుండా కొన్ని వ్యవహారాలు మీరే చక్కబెట్టుకోవాల్సి వుంటుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు పురోభివృద్ధఇ. ఖర్చుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. విలువైన వస్తువులు, ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం.
 
మిథునం: నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు ఒత్తిడి అసహనం ఎదురవుతాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు జయం చేకూరుతుంది. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలించదు.
 
కర్కాటకం : వ్యాపారాభివృద్ధికి నూతన యత్నాలు మొదలెడతారు. ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు ఫలించవు. ఖర్చులు అధికం. ఆరోగ్య భంగం, ప్రశాంతత లోపం వంటి చికాకులు ఎదుర్కొంటారు. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించాలి. స్థిరాస్తి అభివృద్ధి దిశగా ఆలోచనలుంటాయి. చెల్లింపులలో ఏకాగ్రత అవసరం.
 
సింహం : వాహనయోగం, వస్త్రపాప్తి వంటి శుభసూచనలున్నాయి. స్త్రీలు వస్త్రాలు, ఆభరణాలు వంటి విలువైన వస్తువులు అమర్చుకుంటారు. రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడటంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. వైద్యులకు ఒత్తిడి. పనిభారం తప్పవు.
 
కన్య : మిమ్మల్ని చూసి అసూయపడే వారు అధికమవుతున్నారని గమనించండి. నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. ప్రత్తి, పొగాకు, మిర్చి, నూనె, తేయాకు, కాఫీ రంగాల్లో వారికి కలిసి వచ్చే కాలం. స్త్రీల ఆరోగ్యం విషయంలో ఏమరుపాటుతనం కూడదు. విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి.
 
తుల : మందులు, ఆల్కహాలు, కొబ్బరి, పండ్ల, పూల, పానీయ  వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రైవేట్ సంస్థల్లోని వారికి తోటివారి నుంచి సహాయం లభించకపోవడంతో శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. బ్యాంకింగ్, చిట్స్, పైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి, ఇతరత్రా చికాకులు ఎదుర్కోక తప్పదు. ప్రయాణాలు వాయిదా పడతాయి.
 
వృశ్చికం : ఉమ్మడి వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విపరీతంగా వ్యయం చేయాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఒకింత ఆందోళన తప్పదు. సాహస ప్రయత్నాలు విరమించండి.
 
ధనస్సు : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. వ్యవసాయ, తోటల వ్యాపారస్తులకు వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
మకరం : ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ మొండి వైఖరిని వదిలి ప్రశాంతంగా ఉండటం మంచిది. ఒకే సమయంలో అనేక పనులు చేపట్టడం వలన కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు తప్పవు. వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు లాభదాయకం.
 
కుంభం : స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. మీరు చేసే పనులకు బంధువుల నుంచి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. ఒక వ్యవహారంలో బంధు మిత్రుల మధ్య ఏకీభావం లోపిస్తుంది. ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనిభారం అధికం. కొబ్బరి, పండ్ల, పూల చిరు వ్యాపారులకు పురోభివృద్ధి.
 
మీనం : విద్యార్థులకు తోటివారి కారణంగా మాటపడవలసి వస్తుంది. గృహ నిర్మాణావు, మరమ్మతులు ఆశించిన విధంగా సాగుతాయి. శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ఇతరుల వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందిస్తారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments