గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (05:55 IST)

శుభోదయం... మీ రాశి ఫలితాలు 12-08-2017

మేషం : ఈ రోజు ఉద్యోగస్తులు తోటివారిని ఓ కంట కనిపెట్టడం మంచిది. నిరుద్యోగులకు లభించిన అవకాశం స్వల్పమైనదే అయినా సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. చేతివృత్తులు, చిరువ్యాపారులకు కలిసి రాగలదు. పారిశ్రామిక రంగం

మేషం : ఈ రోజు ఉద్యోగస్తులు తోటివారిని ఓ కంట కనిపెట్టడం మంచిది. నిరుద్యోగులకు లభించిన అవకాశం స్వల్పమైనదే అయినా సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. చేతివృత్తులు, చిరువ్యాపారులకు కలిసి రాగలదు. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మిక సమస్యలు తప్పవు. చేపట్టిన పనులలో అవరోధాలు అధికమిస్తారు.
 
వృషభం : ఈ రోజు ఫైనాన్స్, చిట్స్ వ్యాపారులకు ఆశాజనకం. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. వ్యాపారాభివృద్ధికి పలు ప్రణాళికలు పథకాలు రూపొందిస్తారు. ఊహించని ఖర్చులు, పెరిగిన అవసరాల వల్ల స్వల్ప ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మిథునం: ఈ రోజు చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. మీ హోదాకు అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. పాత రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తులు తోటివారి నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. నిర్మాణ పనులలో పెరిగిన వ్యయం, జాప్యం వల్ల ఆందోళన తప్పదు.
 
కర్కాటకం : ఈ రోజు డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పాతమిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీ ఉన్నతిని చాటుకోవటం కోసం ధనం విరివిగా వ్యయం చేయడం మంచిదికాదని గమనించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
సింహం: ఈ రోజు స్త్రీలు చీటికి, మాటికి అసహనం, చికాకులు అధికమవుతాయి. రాజకీయాల్లోని వారికి పార్టీపరంగా, అన్నివిధాలా గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య కలహాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యమైన సంప్రదాయాలు పాటిస్తారు. హోటల్, తినుబండారాలు, బేకరీ పనివారలకు సామాన్యంగా ఉంటుంది.
 
కన్య : ఈ రోజు ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్థంగా నడుపుతారు. భాగస్వామిక చర్చలు ఆశాజనకంగా సాగుతాయి. పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఆకర్షణీయమైన స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. విద్యార్థులు పోటీల్లో రాణిస్తారు.
 
తుల : ఈ రోజు ఉపాధ్యాయులకు రిప్రజెంటివ్‌లకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలు తేలికగా మోసపోయే ఆస్కారం కలదు. బంధువుల రాకతో పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులతో పర్యటనలు అధికం. ఒకసారి జరిగిన తప్పిదం పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి.
 
వృశ్చికం : ఈ రోజు ఉద్యోగస్తులు అధికారుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొంటారు. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. అపరిచితులతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. కిరాణా, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నేడు అనుకూలించని వ్యవహారం రేపు సానుకూలం కాగలదు.
 
ధనస్సు : ఈ రోజు దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. విద్యా వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు.
 
మకరం : ఈ రోజు కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు, వృత్తుల వారికి కలిసిరాగలదు. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అధికారులతో ఏకీభావం కుదరదు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా  వ్యవహరించండి. మీ శ్రీవారు మీతో ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు.
 
కుంభం : ఈ రోజు వస్త్ర, ఫ్యాన్సీ, బంగారం, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు అదనపు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
 
మీనం : ఈ రోజు మీ ఓర్పు, నేర్పులకు ఇది పరీక్షా సమయం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి పంపకాల్లో సోదరుల మధ్య ఏకీభావం నెలకొంటుంది. వైద్య సలహా, ఔషధ సేవనం తప్పదు.