Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 04-10-17

మేషం : దంపతుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడి

Written By pnr
Updated: బుధవారం, 4 అక్టోబరు 2017 (05:50 IST)
మేషం : దంపతుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
వృషభం: వృత్తిపరంగా చికాకులు, ఆటుపోటు ఎదుర్కొంటారు. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునప్పుడు మెళకువ అవసరం. రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. సన్నిహితుల మధ్య రహస్యాలు దాచడం వల్ల విభేదాలు తలెత్తవచ్చు.
 
మిథునం : వ్యాపారాల్లో ఒడిదుడుకులు, స్వల్పనష్టాలు ఎదుర్కొంటారు. సోదరీ సోదరుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు పదే పదే జ్ఞప్తికి వస్తాయి. ఏది జరిగినా మంచికేనని భావించండి. ఏ పని మొదలెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
కర్కాటకం : ఆర్థిక లావాదేవీలు, ముఖ్యమైన వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. ఖర్చులు ప్రయోజనకరం. వేధింపుల అధికారి బదిలీ వార్త ఉద్యోగస్తులకు సంతోషం కలిగిస్తుంది. సహోద్యోగులతో సమావేశాలు, విందుల్లో పాల్గొంటారు. మీ వాహనం ఇతరులకు ఇవ్వవద్దు. వృత్తిపరంగా చికాకులు, ఆటుపోట్లు ఎదుర్కొంటారు.
 
సింహం: అలవాటు లేని పనులు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. వృత్తిపరమైన సంబంధాలు బలపడతాయి. ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. సావకాశంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. హోల్‌సేల్, రిటైల్ పెద్దమొత్తం స్టాక్‌లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
 
కన్య: విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు. రావలసిన ధనం చేతికందుతుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
తుల: విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి లభిస్తుంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. శత్రువులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. బంధువుల నుంచి విమర్శలు తప్పవు. స్త్రీలకు బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదురవుతాయి.
 
వృశ్చికం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. తరచూ సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొండి బకాయిలు వసూలు కాగలవు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
ధనస్సు: మీ యత్నాల్లో ఆలస్యంగానైనా మంచి ఫలితాలు లభిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. రిప్రజెంటేటివ్‌లు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలను  పొందగలుగుతారు.
 
మకరం: శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. రవాణా కార్యక్రమాల్లో చురుకుదనం కానవస్తుంది. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖుల సహకారంతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది.
 
కుంభం : ద్విచక్ర వాహన చోదకులకు దూకుడు తగదు. సోదరీ, సోదరులతో అవగాహన కుదరదు. విద్యార్థుల్లో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్త్రీలకు బంధువులతో పట్టింపులొస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది.
 
మీనం: కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రైవేట్ సంస్థల్లో వారు, ఓర్పు, అంకిత భావంతో పనిచేయాల్సి వుంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకులను కలిగిస్తుంది. ఏ విషయంలోను తొందరపడక బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి వుంటుంది. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments