Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఇంటికి వెనుక కలబంద మొక్క.. శివాలయంలో పెరుగన్నం దానం చేస్తే? (video)

Written By సెల్వి
Updated: సోమవారం, 21 అక్టోబరు 2019 (18:46 IST)
ఆదాయం వస్తూనే వున్నా.. ఖర్చు మాత్రం దానికి తగ్గట్టుగానే వస్తోందా? ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవట్లేదా? ఆర్థికంగానే కాకుండా, మానసికంగా ఇబ్బందులు వెంటాడుతున్నాయా? అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోండి అంటున్నారు.. ఆధ్యాత్మిక నిపుణులు. వృత్తిలో రాణించడం కోసం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలను దూరం చేసుకోవాలనుకుంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ చిట్కాలు పాటించాలని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు.
 
అవేంటంటే? రోజూ అన్నం వండేందుకు బియ్యం తీస్తున్నప్పుడు.. గుప్పెడు బియ్యాన్ని వేరొక మట్టి కుండలో వేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా 21 రోజులు తీసిపెట్టిన గుప్పెడేసి బియ్యంతో పెరుగన్నంగా తయారు చేసి.. ఏదేని శివాలయంలో అన్నదానం చేయాలి. ఇలా వరుసగా చేస్తూ వస్తే.. మీకు తెలియకుండానే ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. అలాగే ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. అప్పులు తీరిపోతాయి. 
 
ఇంకా ఇంటికి ఆగ్నేయ దిశలో ఒక గాజు పాత్రలో లేదా మట్టి పాత్రలో నీరును వుంచి అందులో కొత్తిమీర ఆకులను వేయాలి. ఈ నీటిని రోజూ మారుస్తూ.. వుండాలి. కొత్తిమీరను కూడా మార్చాలి. 
 
అలాగే ఓ పాత్రలో బియ్యం తీసుకుని.. తొలుత కుటుంబ యజమాని చేతి నుంచి రెండు నాణేలను ఆ బియ్యంలో వుంచమనాలి. తర్వాత ఆ కుటుంబంలోని వారంతా తలా ఒక్కో నాణేన్ని అందులో వుంచి పూజ గదిలో వుంచి పూజించాలి. ఇలా చేస్తే ధనార్జన పెరుగుతుంది. ఆహారానికి ఎలాంటి లోటు వుండదు. ఆరు మాసాలకు ఒకసారి ఈ బియ్యాన్ని మారుస్తూ వుండాలి. ఈ బియ్యాన్ని పక్షులకు ఆహారంగా వుంచేసి నాణేలను బీరువాలో భద్రపరుచుకోవాలి. 
 
ఇంటికి వెనుకల వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి. ధనాదాయం పెరుగుతుంది. ఇంట్లోని ఆగ్నేయంలో రెండు మొక్కజొన్న కందులను వేలాడదీయాలి. ఆరునెలలకు ఒకసారి వీటిని మార్చేసి.. ఆ మొక్కజొన్న గింజలను పక్షులను ఇవ్వడం చేయడం ద్వారా ఆ ఇంట సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. 
 
వీటితో పాటు మంగళవారం, శుక్రవారం పూట ఇంటిని శుభ్రం చేసుకుని మహాలక్ష్మీదేవిని, అమ్మవారిని పూజించడం ద్వారా సకల శుభాలతో పాటు.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

October 11, 2026: అక్టోబర్ 11నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన

మావోలకు వైద్యం అందించిన డాక్టర్.. దొరకడు.. చిక్కడు.. తప్పించుకుని..?

రాయలసీమ ఉద్యానవన సాగులో డ్రోన్‌ల వినియోగం- అందుబాటులో అద్దెకు డ్రోన్లు

చాగల్లు సమీపంలో పులి సంచారం... ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ ఆదేశాలు

మెడికవర్ హాస్పిటల్స్‌కు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు: యాజమాన్యం

అన్నీ చూడండి

11-10-2026 ఆదివారం మీ రాశి ఫలాలు - ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది

11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?

Sabarimala: శబరిమల యాత్రికుల కోసం QR కోడ్‌లు, సమాచార కేంద్రాల ఏర్పాటు

10-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు... ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది

Ramanujacharya: నవరాత్రి బ్రహ్మోత్సవాలు... మాడ వీధులు.. రామానుజాచార్యుల ఏర్పాట్లు

తర్వాతి కథనం
Show comments