1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 జులై 2025 (21:46 IST)

24 సంవత్సరాల తర్వాత జూలై 26న గజలక్ష్మీ యోగం.. ఏ రాశులకు అదృష్టం?

Gajalakshmi Raja Yoga
Gajalakshmi Raja Yoga
24 సంవత్సాల తర్వాత మళ్లీ ఈ ఏడాది జూలై 26న గజలక్ష్మీ యోగం ఏర్పడుతుంది. శుక్రుడు, బృహస్పతి గ్రహాల కలయికతో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ గజలక్ష్మి యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారం కానుంది. ఈ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు, రుణాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోనున్నాయి. ఆ రాశులేంటో చూద్దాం.. 
 
మేషరాశి వారికి గజలక్ష్మి యోగం స్నేహ బంధాన్ని బలపరుస్తుంది. ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. వ్యాపారాభివృద్ధి. అడ్డంకులు తొలగిపోతాయి. అన్నీ రంగాల్లో విజయం వరిస్తుంది. మిథునరాశి వారికి గజలక్ష్మి యోగం శుభాన్నిస్తుంది. కుటుంబంలో ఆనందం, ఆర్థిక, కెరీర్ పరంగా మెరుగైన పరిస్థితులు చేకూరుతాయి. 
 
ఇక సింహరాశి జాతకులు ఆర్థికంగా మరింత బలపడనున్నారు. ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే కన్యారాశి వారికి శుక్రుడు, బృహస్పతి గ్రహాల కలయిక  వల్ల ఏర్పడే ఈ గజలక్ష్మీ యోగం ద్వారా కొత్త గృహం కొనుగోలు చేసే ఆస్కారం వుంది. ఉద్యోగపరంగా సానుకూల ఫలితాలు వున్నాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. 
 
తులారాశి వారికి గజలక్ష్మి యోగం.. తులారాశి వారి జీవితంలో ఆర్ధిక సంతోషాలను కలిగించబోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని జ్యోతిష్య  నిపుణులు అంటున్నారు.