శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : బుధవారం, 3 జనవరి 2018 (08:28 IST)

ఈ రోజు (బుధవారం) దినఫలాలు ... దుబారా ఖర్చులు పెరుగుతాయి

మేషం : ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావి

మేషం : ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు మరికొంత సమయం పడుతుంది. 
 
వృషభం: ఎటువంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. స్త్రీలకు సంతానంతో, పనివారలతో చికాకులు తప్పవు. ప్రైవేట్ సంస్థలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య బంధం మరింతగా దృఢంగా మారుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మిథునం: అకాల భోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. ధనం ఎంత వెచ్చించినా ఫలితం సామాన్యంగానే ఉంటుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి విమర్శలు తప్పవు. 
 
కర్కాటకం: వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. ఖర్చులు అదుపు చేయలేకపోతే మరింత ధనవ్యయం అవుతుంది. విద్యారంగంలో వారికి నూతన ఉత్సాహం కానరాగలదు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
సింహం : జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కొంటారు. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు ఎంతో అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారులకు సమస్యలు ఎదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
కన్య: సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు  సమీక్షిస్తారు. కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు తప్పవు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికిరాగలవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
తుల: దంపతుల మధ్య తరచు చిన్న చిన్న తగవులు. మాట పట్టింపులు చోటుచేసుకుంటాయి. ప్రముఖ ఆలయాల్లో దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. మీ బలహీనతలను ఆసరా చేసుకుని కొంతమంది లబ్ధి పొందాలని చూస్తారు. మీ అవసరాలకు కావలసిన ధనం ముందుగానే సర్దుబాటు చేసుకుంటారు.
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు, తోటివారి ప్రశంసలు లభిస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కొబ్బరి,  పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దుబారా ఖర్చులు అధికమవుతాయి. 
 
ధనస్సు: విద్యార్థులకు అధిక శ్రమ వల్ల ఆరోగ్యంలో చికాకులు తప్పవు. కుటుంబ విషయాల్లో కూడా మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాట వేయండి. రుణం ఓ కొంతైనా తీర్చటానికై చేయు ప్రయత్నం వాయిదా వేస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. 
 
మకరం: స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. పత్రికా, వార్తా సంస్థల్లోని వారికి ఏకాగ్రత ముఖ్యం. అనుకున్న వ్యక్తుల కలయిక అనుకూలించక పోవడంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
కుంభం: కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన, నిరుత్సాహం కలిగిస్తాయి. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. తరచుగా తెలియక చేసిన పొరపాట్లను పశ్చాత్తాపపడతారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
మీనం: ఆర్థిక విషయాల్లో ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారులకు చికాకులు తప్పవు. తరచుగా తెలియక చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపపడతారు. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి.