ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2017 (09:20 IST)

23-12-2017 శనివారం రాశి ఫలితాలు

మేషం: అయిన వారే సాయం చేసేందుకు సందేహిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఎలక్ట్రానిక

మేషం: అయిన వారే సాయం చేసేందుకు సందేహిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పుదు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం.
 
వృషభం: మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
మిథునం: ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ అవసరాలు ఏదోవిధంగా నెరవేరగలవు. ఒకనాటి మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు.
 
కర్కాటకం: వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. లౌక్యంగా మెలిగి పనులు చక్కబెట్టుకుంటారు. దుబారా ఖర్చులు అదుపులు చేయగలుగుతారు. స్త్రీలు, టీవీ కార్యక్రమాల్లో రాణిస్తారు. ద్విచక్ర వాహన చోదకులకు చికాకులను ఎదుర్కొంటారు.
 
సింహం: ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. సోదరీ సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. వ్యాపారాల్లో ఒక నష్టం మరో విధంగా పూడ్చుకుంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు.
 
కన్య: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు లాభాలనిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. అందరితో సఖ్యతగా మెలుగుతూ ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన లోపం.
 
తుల: మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి. మీ చెంత ధనం వుందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. బంధువులను కలుసుకుంటారు. రాజకీయనాయకులకు దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు అధికం.
 
వృశ్చికం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ  సమాచారం అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. స్థిరాస్తి అమ్మకానికై చేయు ప్రయత్నం విరమించుకోవటం మంచిది. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
ధనస్సు: ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కొంటారు. విజ్ఞతతో వ్యవహారించి రుణదాతలను సమాధానపరుస్తారు. మీ వాక్చాతుర్యం, లౌక్యంతో అనుకున్నది సాధిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. పెద్దలను, గురువులను గౌరవించడం వల్ల మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
మకరం: శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఆలయ సందర్శనాల్లో చురుకుగా పాల్గొంటారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిదికాదని గమనించండి. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
కుంభం: విద్యార్థులు క్రీడా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక  ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి.
 
మీనం : ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఖర్చులు రాబడికి మించడం వల్ల స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కోనక తప్పదు. ఎప్పటి నుంచో వాయిదా పడుత వస్తున్న పనులు పూర్తి చేస్తారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.