సోమవారం, 30 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2017 (08:18 IST)

శుక్రవారం దినఫలితాలు : కుబేరుడిని ఆరాధిస్తే ఐశ్వర్యం...

మేషం: చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. బాధలన్నింటినీ వదిలి సంతోషమైన

మేషం: చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. బాధలన్నింటినీ వదిలి సంతోషమైన జీవితాన్ని గడపండి. కాళ్లు, నరాలు, నడుముకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. 
 
వృషభం: వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొంతమంది మిమ్ములను తప్పుదోవ పట్టించి లబ్ధి పొందటానికి యత్నిస్తారు.
 
మిథునం: బ్యాంకుల్లో మీ పనులకు స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. అయిన వారి కోసం తాపత్రయపడతారు. పుణ్యక్షేత్రాలు, కొత్తప్రదేశాలు సందర్శిస్తారు. రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం.
 
కర్కాటకం: మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచడం శ్రేయస్కరం. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు.
 
సింహం: బంధువుల రాకపోకలు పునరావృతమవుతాయి. ఊహించని ఖర్చుల వల్ల చేబుదుళ్ళు వంటివి తప్పవు. భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తవచ్చు. ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. విద్యార్థులు లక్ష్య సాధనకు ఏకాగ్రత, పట్టుదలతో శ్రమించాలి. రాని మొండి బకాయిలు సైతం వసూలు చేస్తారు.
 
కన్య: పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. పాత వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. నిరుద్యోగ యత్నాలు ఒక కొలిక్కివస్తాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు వృత్తిపరమైన చికాకులు ఎదుర్కొనవలసివస్తుంది.
 
తుల: ఒక విషయంలో బంధువుల నైజం బయటపడుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులను ఎదుర్కొంటారు. స్థిరచరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ శ్రీమతి సూటిపోటీ మాటలు అసహనం కలిగిస్తాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు.
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. ఆకస్మికంగా మిత్రులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. వార్తా సంస్థల్లోని సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి.
 
ధనస్సు: తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయ. పారిశ్రామిక రంగంలోని వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. పంతాలు, పట్టింపులకు ఇది సమయం కాదు.
 
మకరం: వృత్తి వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో శ్రమించి సఫలీకృతులవుతారు. తరచూ దేవాలయ సందర్శనం చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కుంభం: ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ధ వహించండి. గృహోపకరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. పాత పరిచయస్తులు, ఆప్తులను కలుసుకుంటారు. స్త్రీలు టీవీ కార్యక్రమాల్లో రాణిస్తారు. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలకు అనుకూలమైన కాలం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
మీనం: ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ఆశించినంత సంతృప్తినీయజాలవు. మీ భర్తలో ఉన్నట్టుంది వేదాంత ధోరణి కానవస్తుంది. స్త్రీలకు బరువు, బాధ్యతలకు అధికమవుతాయి. మీ ఆలోచనలను నీరుగార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.