మంగళవారం, 28 మార్చి 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated: మంగళవారం, 15 నవంబరు 2022 (14:24 IST)

కాలాష్టమి వ్రతం 2022: పూజా సమయం.. ప్రాముఖ్యత ఏంటంటే?

kala bhairava homam
కాలాష్టమి ఉపవాసం, దాని ప్రాముఖ్యత, పూజా విధానం, శుభ సమయం ఏంటో తెలుసుకుందాం. కాలాష్టమి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. 
 
కాల భైరవ అష్టమి రోజున, శివుని రుద్ర అవతారం, కాల భైరవుడిని పూజిస్తారు. ఈ రోజున పూజించడం వల్ల జీవితంలో సుఖశాంతులు కలుగుతుందని విశ్వాసం. కాల అష్టమి లేదా కాల భైరవ అష్టమి ప్రతి నెల కృష్ణ పక్ష అష్టమి నాడు జరుపుకుంటారు. ఈసారి కాలభైరవ అష్టమి నవంబర్ 16 బుధవారం వస్తోంది.  
 
కాలాష్టమి ప్రాముఖ్యత
ఈ రోజున భైరవుడిని పూజించడం వల్ల భయం నుండి విముక్తి లభిస్తుంది. ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి. భైరవుడిని ఆరాధించడం వల్ల శత్రువులు తొలగిపోతారు.
 
కాలభైరవ అష్టమి 2022 శుభ సమయం: అష్టమి తిథి నవంబర్ 16, 2022 ఉదయం 05.49 గంటలకు ప్రారంభమవుతుంది, ఇది నవంబర్ 17 రాత్రి 07.57 వరకు ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున, తెల్లవారుజామున నిద్రలేచి, స్నానము మొదలైన వాటిని ముగించాలి. 
 
వీలైతే, ఈ రోజు ఉపవాసం ఉండండి.
ఆలయంలో దీపం వెలిగించండి.
ఈ రోజున మహేశ్వరుడిని, పార్వతి దేవిని, గణేశుడిని కూడా పూజించాలి. 
భగవంతునికి సాత్త్విక పదార్థాలు మాత్రమే సమర్పించాలి.