ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (23:09 IST)

కన్నతల్లికి దూరంగా వుంటే.. కార్తీక పౌర్ణమి రోజున..?

కార్తీక పౌర్ణమి రోజున కన్నతల్లికి దూరంగా ఉంటే, ఉదయాన్నే ఒక రాగి పాత్రలో గోధుమలతో తయారుచేసి పిండి వంటలు లేదా గోధుమ పిండిని దానం చేయండి. ఈ రోజు పితరులకు యజ్ఞ యాగాదులు చేస్తే మీ పూర్వీకులకు శాంతి, సంతోషాలు కలుగుతాయి. యజ్ఞ యాగాదాలు చేయలేకపోతే పితరులను స్మరిస్తే చాలు. తులసి, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం మంచిది.
 
ఈ రోజున ఎవరైనా దానధర్మాలు, మంత్రోచ్ఛారణలు లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటే, పది యజ్ఞయాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజు తులసి మొక్కను ఇతరులకు దానం చేయడం కూడా మంచిదే. ఇంకా వివాహం కాని కన్యలు త్రిజాత లక్ష్మీ పూజ చేస్తే కోరుకున్న వరుడు లభిస్తాడు. పిండితో చేసిన 11, 21 లేదా 108 దీపాలను నది నీటిలో వెలిగించాలి.