గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (21:33 IST)

24-09-2024 మధ్య అష్టమి.. కాలభైరవుడిని, శివుడిని పూజిస్తే?

పితృ పక్ష శ్రాద్ధాన్ని పాటించడం  పుణ్య ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే శ్రాద్ధం చేయడం వల్ల మరణించిన పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుంది. మధ్య అష్టమి కూడా అలాంటిదే. ఈ రోజున పితరులకు శ్రాద్ధం ఇవ్వడం చేస్తే వంశాభివృద్ధి, సంతాన భాగ్యం కలుగుతుంది. 
 
ఈ రోజును పితరులకు అంకితం చేస్తారు. భాద్రపద కృష్ణ పక్ష అష్టమి తిథిన వచ్చే ఈ రోజు పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వడం చేస్తే.. పితృదోషాలు తొలగిపోతాయి. అలాంటి ఈ మధ్య అష్టమి సెప్టెంబర్ 24న వస్తుంది.
 
 ఈ మధ్యాష్టమి నాడు, సూర్యుడు ఉదయం 6:20 నుండి సాయంత్రం 6:17 గంటలకు అస్తమించే వరకు కనిపిస్తాడు. చంద్రుడు రాత్రి 11:24 గంటలకు ఉదయించి మధ్యాహ్నం 12:46 గంటలకు అస్తమిస్తాడని అంచనా. 
 
పితృ పక్ష కాలంలోని అన్ని రోజులలో చేసే ఆచారాల మాదిరిగానే ఈ రోజున కూడా పిండప్రదానం చేస్తారు. తర్పణాలు ఇస్తారు. ఇలా చేస్తే పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా, మధ్యాష్టమి రోజున, భక్తులు శివుని దైవానుగ్రహాన్ని కోరుతూ పూజిస్తారు. అలాగే కాలభైరవునికి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఈతి బాధలు తొలగిపోతాయి.