1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Anantha Padmanabha Swamy Vratham Significance

అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే ఏం జరుగుతుంది.. మహిమ ఏంటి?

Anantha padmanabha
సెప్టెంబర్ 17వ తేదీ భాద్రపద శుద్ధ పౌర్ణమితో కూడిన చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతాన్ని జరుపుకుంటారు. ధర్మరాజు కోరికపై శ్రీకృష్ణుడు అనంత పద్మనాభ వ్రత విధానాన్ని వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. 14 సంవత్సరాల పాటు అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటే ఈతిబాధలు తొలగిపోతాయి. దారిద్ర్యం తొలగిపోతుంది.
 
వ్యాస మహర్షి రచించిన మహాభారతంలో అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి ప్రస్తావన ఉంది. పూర్వం పాండవులు అరణ్యవాసంలో వున్నప్పుడు తమ కష్టాల నుంచి విముక్తి పొందేందుకు.. ధర్మరాజు శ్రీ కృష్ణునితో ఎటువంటి వ్రతం చేసినట్లయితే తమ కష్టాలు తొలగిపోతాయో ఉపదేశించమని అడిగాడు. 
 
అందుకు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అరణ్యవాసంలో వారు ఎదుర్కొంటున్న కష్టాలు తొలగిపోవాలంటే 'అనంత పద్మనాభ స్వామి వ్రతం' చేయమని తెలిపాడు. ఈ రోజున శేషపాన్పుపై గల మహావిష్ణువును దర్శించుకోవాలి. ఆయనకు నిష్ఠతో పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి. 
About Writer
సెల్వి