గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (22:04 IST)

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

anchor shyamala
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామలను నియమించింది. శ్యామల ఇటీవలి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు. 
 
అపాయింట్‌మెంట్ వచ్చిన వెంటనే, శ్యామల విజయవాడ వరదలకు జగన్ కోటి రూపాయల విరాళం ఇచ్చినందుకుగాను ప్రశంసించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎప్పుడూ ప్రజా ప్రయోజనాలకు సహకరించలేదని ఒక వీడియోను పోస్ట్ చేశారు.
 
టీడీపీ, జనసేన మద్దతుదారులను రెచ్చగొట్టేలా ఈ వీడియో ఉంది. అనుకున్నట్టుగానే శ్యామలను ట్రోల్ చేసారు. శ్యామలకి సంబంధించిన కొన్ని పాత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ షేర్ చేస్తూ ఆమెపై విమర్శలు గుప్పించారు.