Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభోదయం : రాశిఫలితాలు 31-10-2017

మేషం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. కుటుంబీకులతో కలిసి ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితం

Written By raman
Updated: మంగళవారం, 31 అక్టోబరు 2017 (06:37 IST)
మేషం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. కుటుంబీకులతో కలిసి ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్తి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు.
 
వృషభం: సేవ, సందర్భానికి అనుగుణంగా మీ కార్యక్రమాలు, పనులు మార్చుకుంటారు. మీ వాక్చాతుర్యానికి, మంచితనానికి గుర్తింపు లభిస్తుంది. ప్రైవేట్ సంస్థల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. ఇతరులకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.
 
మిథునం: ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ చాలా అవసరం. ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు.
 
కర్కాటకం: ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ఉల్లి, బెల్లం, పసుపు, కంది, మిర్చి వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు లాభదాయకం. ఆలయాలను సందర్శిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఒత్తిడి, చికాకు కలిగిస్తుంది. రాజకీయ నాయకులు తరచూ సభా సమావేశాల్లో పాల్గొంటారు.
 
సింహం: వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తాయి. అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. మీకు నచ్చని సంఘటనలు జరుగుతాయి. 
 
కన్య: వృత్తుల్లో వారికి టెక్నికల్ రంగాల్లో వారికి అధిక ఒత్తిడి, చికాకు తప్పదు. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. స్నేహ పరిచయాలు విస్తరిస్తాయి. ఒక వ్యవహారంలో సోదరుల నుండి పట్టింపులు, వ్యతిరేకత ఎదుర్కోవలసివస్తుంది.
 
తుల: స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, బహుమతులు అందుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి వుంటుంది.
 
వృశ్చికం : రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అకాలభోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత వహించినా సత్ఫలితాలు పొందగలరు. అందరితోను కలుపుగోలుగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు.
 
ధనస్సు: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. బంధుమిత్రులు మీ వైఖరిని తప్పుపడతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. వృత్తులు, మార్కెట్ రంగాల వారికి శ్రమ అధికం, ఆదాయం స్వల్పం. మీ అంచనాలు, పథకాల బెడసికొట్టే ఆస్కారం ఉంది. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది.
 
మకరం: రాజకీయనాయకులు తరచు సభాసమావేశాల్లో పాల్గొంటారు. రవణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానరాగలదు. గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. అందరితో కలుపు గోలుగా మెలగి మన్ననలు పొందుతారు. స్త్రీలకు ఆరోగ్యం ఆందోళన చెందుతారు.
 
కుంభం: ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. రాబోయే అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు చేసుకుంటారు. ఇతరులపై ఆధారపడక మీ పనులు మీరే చేసుకోవడం క్షేమదాయకం. దూరప్రదేశంలోని ఆత్మీయులు, సంతానంతో సంభాషిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం శ్రేయస్కరం. 
 
మీనం: ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులతో కీలకమైన వ్యవహారాలు చర్చలు జరుపుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments