సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:30 IST)

మంగళవారం ఇంటి గుమ్మానికి అటూఇటూ కలువ పువ్వులు..?

శ్రీ లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటుఇటూ పెడితే అదీ మంగళవారాల్లో తప్పక పెడితే.. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాటిని రోజూ మార్చుతూ కొత్తవి పెడితే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోయినా వేరు పువ్వులు పెడితే మంచిది.
 
అలాగే గుమ్మం కనుక ఈశాన్యం మూల ఉంటె గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్ళు తీసుకుని, దానిలో నీళ్ళు నింపి దానిలో 5 రూపాయల బిళ్ళలు, పచ్చ కర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి. ఇలా చేయడం ద్వారా దరిద్రం పోయి, సమస్యలు, అప్పుల బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
 
ప్రతి మంగళ, శుక్రవారం సాయంత్రం పూట గుగ్గిలం, సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది. దుష్ట శక్తుల నివారణకు, నెగెటివ్ ఫోర్స్‌లకు చెక్‌పెట్టి చక్కటి ప్రశాంతత, అష్టలక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ప్రతి మంగళ, శుక్రవారం గడపలకు, తులసీకోటకు పసుపుతో అలంకరణ, పూజ చేస్తే శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.