Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు సోమవారం పుట్టినవారైతే? (video)

Written By సెల్వి
Updated: సోమవారం, 28 సెప్టెంబరు 2020 (09:19 IST)
సోమవారం జన్మించిన జాతకులు ప్రతిభావంతులు. వారంలోని రెండవ రోజు అయిన సోమవారం చంద్ర గ్రహానికి సంబంధించింది. ఈ రోజుకు చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో చంద్రుని గ్రహానికి చాలా ప్రాధాన్యత వుంది. ఇది భూమికి చాలా దగ్గరగా వుంటుంది. అందుకే భూమిపై నివసించే జనులకు చంద్రుని ప్రభావం ప్రతికూల ఫలితాలను అధికంగా ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటూ వుంటారు. 
 
చంద్రుడు ప్రకాశవంతంగా వుంటాడు. చంద్రుడు మనస్సుకు పాలకుడు. ఈ గ్రహం జీవితం, కుటుంబ సంబంధాలకు కారకం. సోమవారం జన్మించిన వ్యక్తులు చంద్రుడిని పూజిస్తే సానుకూల ఫలితాలను పొందవచ్చు. 
 
సోమవారం జన్మించిన పురుషులైనా, మహిళలైనా.. గృహ జీవితంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. సాక్ష్యాలు, ఆధారాల కంటే.. వ్యక్తిగత భావాలకు, అనుభవానికి ప్రాధాన్యత ఇస్తారు. సోమవారం జన్మించిన వారి అదృష్ట సంఖ్య రెండు. ఈ సంఖ్యను ఉపయోగిస్తే ప్రతికూల ఫలితాలుండవు. సోమవారం జన్మించిన జాతకులు సోమవారం శివుడిని, గణేషునిని ఆరాధించడం వల్ల జీవితంలో ఎంతో అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు.
 
సోమవారం జన్మించిన జాతకులు కెరీర్‌ పరంగా రాణిస్తారు. వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉన్నత పదవులను అలంకరిస్తారు. ప్రతి విషయాన్ని శ్రద్ధగా చేస్తారు. చేసే పనిని దైవంగా భావిస్తారు. ఉద్యోగం, వ్యాపారం ఈ రెండింటిలోనూ ఈ జాతకులదే పై చేయి. 
moon
 
క్రమశిక్షణగా ప్రవర్తించే ఈ జాతకులు ఇతరులు సులభంగా ఆకట్టుకుంటారు. వాక్చాతుర్యం అద్భుతం. వ్యక్తిగత విషయాలపై అధిక శ్రద్ధ వహిస్తారు. ఇతరులను తేలికగా నమ్మరు. అయితే నమ్మిన వారి కోసం ఏదైనా చేసేందుకు వెనుకాడరు. కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించాలనుకుంటారు. సోమవారం జన్మించిన జాతకులు తమకు సానుకూలమైన భాగస్వామినే ఎంచుకుంటారు.

 

అన్నీ చూడండి

నవంబర్ నుంచి అన్ని పాఠశాలలకు అల్పాహార పథకం.. తెలంగాణ

కో-లైవ్ పీజీలో ఆ ఇద్దరు.. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఏడో అంతస్థు నుంచి దూకేశారు..

ఇదే భారతదేశం బ్యూటీ, ఎవరెన్ని చేసినా ఒకరి పండుగలంటే మరొకరికి ఎంతో ఇష్టం, వీడియో

ఏరా నీక్కూడా ఆ అమ్మాయే కావాల్సిచ్చొందా? చావు అంటూ హత్య చేసిన ఫ్రెండ్

బాయ్‌ఫ్రెండ్‌కు బైక్ కొనేందుకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో బంగారం కొట్టేసింది..

అన్నీ చూడండి

05-09-2026 శనివారం దినఫలాలు - ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టండి...

Janmashtami, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల చూసారా?, వీడియో

04-09-2026 శుక్రవారం నాటి రాశి ఫలితాలు... ధన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం..

03-09-2026 గురువారం రాశి ఫలితాలు... కొత్త ప్రాజెక్ట్‌కు అనుకూలమైన రోజు

Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)

తర్వాతి కథనం
Show comments