గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2020 (09:48 IST)

28-09-2020 సోమవారం దినఫలాలు - శంఖరుడికి పూజతో సంకల్ప సిద్ధి (video)

మేషం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ చాలా అవసరం. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. క్రయ, విక్రయాలు లాభదాకయంగా ఉంటాయి. బ్యాంకు పనులు విసుగు కలిగిస్తాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశం వారిని సందిగ్ధంలో పడవేస్తుంది. 
 
వృషభం : ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సారం కలిగిస్తుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మిత్రులపై మీరు పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లుతుంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మత్స్యు, కోళ్ల, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. 
 
మిథునం : ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. రహస్య విరోధులు అధికంకావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ప్రభుత్వ కార్యాలయాల్ల మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి వస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. దంపతుల మధ్య ప్రేమానుబంధం బలపడుతుంది. 
 
కర్కాటకం : ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కొత్త రుణాల కోసం అన్వేషణ కొనసాగిస్తారు. రవాణా రంగంలోని వారికి చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. 
 
సింహం : ఉద్యోగస్తుల సమర్థతను, అంకిత భావాన్ని అధికారులు గుర్తిస్తారు. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలకు బంధు మిత్రులతో పట్టింపులు అధికమవుతాయి. మీ వ్యక్తిగత భావాలను, సమస్యలను బయటకి వ్యక్తం చేయకండి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి.
 
కన్య : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. ధనవ్యయం, చెల్లింపుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
తుల : స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మిర్చి, నూనె, ఆవాలు, చింతపండు వెల్లుల్లి వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. కోర్టు వ్యహారాలు వాయిదా కోరుకవోడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో మార్పులు అనుకూలిస్తాయి. 
 
వృశ్చికం : క్యాటరింగ్ పనివారలకు, హోటల్, తినుబండారాల వ్యాపారులకు సంతృప్తినిస్తాయి భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల విషయంలో సంతృప్తికానరాదు. మిత్రులు కూడా మీకు దూరంగా ఉండటానికి యత్నిస్తారు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. 
 
ధనస్సు : వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కార్యక్రమాలు సమయానుకూలంగా మార్చుకోవలసి ఉంటుంది. చిన్నతరహా పరిశ్రమలలో వారికి పురోభివృద్ధి. విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత వహించలేరు. నూతన అగ్రిమెంట్లు వాయిదాపడతాయి. ప్రత్యర్థులుసైతం మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. 
 
మకరం : ఉద్యోగస్తులు తొందరపాటుతనం వల్ల అధికారులతో మాటపడక తప్పదు. మీ ఆలోచనలు క్రియారూపంలో పెట్టి జయం పొందండి. సందర్భానుకూలంగా సంభాషించుటవల్ల మీకు గుర్తింపు లభిస్తుంది. సేవా, పుణ్య కార్యాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. విదేశీ యత్నాలు ఫలిస్తాయి. 
 
కుంభం : ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కనిపిస్తుంది. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అధిక శ్రమ తప్పదు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీరు కోరుకునే మార్పులు నిదానంగా అనుకూలిస్తాయి. 
 
మీనం : ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. స్థిరాస్తని అమర్చుకుంటారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమన్వయం లోపిస్తుంది. వ్యాపారాల్లో చిక్కులు తొలగిపోతాయి.