ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (15:56 IST)

నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది.. పోతులూరి వీరబ్రహ్మం

కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనులు ఆకలితో అరిచి అరిచి చనిపోతారు. కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవు కూడా మిగలదు.
 
ఉప్పుకొడూరులో ఊరచెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించి పోతారు. 14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనమని పోతులూరి వీరబ్రహ్మం అన్నారు. 
 
5972 ధాతు నామ సంవత్సరాన మాఘ శుద్ధ బుధవారం రోజున పట్ట పగలే 18 పట్టణాలు దోపిడీకి గురౌతాయి. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. పట్ట పగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. 
 
మహానంది మరుగున మహిమలు పుడతాయి. సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది. విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది. నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుందని పోతులూరి వీరబ్రహ్మం తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు.