మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

08-01-2020 బుధవారం దినఫలాలు - గాయత్రి మాతను ఆరాధిస్తే శుభం...

మేషం : యాధృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఒక వేడుకను ఘనంగా చేయడానికి సన్నాహాలు మొదలెడుతారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.
 
వృషభం : మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన కొంతకాలం వాయిదావేయడం మంచిది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ప్రలోభాలకు లొంగవద్దు.
 
మిథునం : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొన్ని పనులు సాధిస్తారు. ఎడతెగని ఆలోచనలు, అవిశ్రాంత కృషి ఫలితంగా ఆరోగ్యం మందగిస్తుంది. గృహంలో ఏదైనా శుభకార్యం నిమిత్తం చేసే కృషి ఫలిస్తుంది.
 
కర్కాటకం : బంధువుల రాకవల్ల గృహంలో సందడి, కొత్త ఉత్సాహం నెలకొంటుంది. మీ జీవితం మీరు కోరుకున్నట్టుగానే చక్కగా మలచుకోవడానికి ప్రయత్నించండి. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం చేతికందడంతో పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలు ఉంటాయి.
 
సింహం : మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. విదేశీయానం కోసం చేసేయత్నాలు అనుకూలిస్తాయి. కళాత్మక విలువలకు ప్రోత్సాహమిస్తారు. మనసులో భయాందోళనలు అనుమానాలు ఉన్నా ఢాంబికం ప్రదర్శించి పనులు సాఫీగా పూర్తిచేస్తారు. పత్రికా, మీడియా రంగాలవారికి నూతన అవకాశాలు లభిస్తాయి.
 
కన్య : ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. స్త్రీలకు ఇరుగుపొరుగువారితో సఖ్యత అంతగా ఉండదు.
 
తుల : స్త్రీలు తొందరపాటుతనం వల్ల ప్రియతములను దూరం చేసుకుంటారు. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సౌంతంగా గానీ, భాగస్వామ్యంగా గానీ మీరు ఆశించిన విధంగా రాణించలేరు. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి.
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. విద్యార్థులకు దూకుడు తగదు. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు తప్పవు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఎంత కష్టమైనపనైనా అవలీలగా పూర్తిచేస్తారు.
 
ధనస్సు : సహోద్యోగులతో వాగ్వాదాలు తగదు. భాగస్వామిక ఒప్పందాల్లో ఖచ్చితంగా ఉండాలి. ప్రయాణాల్లో చికాకులు అధికం. పనులు మందకొడిగా  సాగుతాయి. ఫ్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఏకాగ్రత ప్రధానం.
 
మకరం : వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. స్త్రీల ప్రతిభగు గుర్తింపు, బహుమతులు అందుతాయి. కొత్త స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. గృహమార్పు యత్నం మంచి ఫలితాన్నిస్తుంది. సేల్స్ సిబ్బంది, కొనుగోలుదార్లతో అనునయంగా మెలగాలి. పందేలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి.
 
కుంభం : భాగస్వామిక సంస్థల్లో మీ పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు. వాహనం నిదానంగా నడపండి. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ప్రత్యర్థుల కదలికలను గమనిస్తుండాలి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఉద్యోగస్తులకు పండగ అడ్వాన్సులు మంజూరవుతాయి.
 
మీనం : మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. విద్యార్థులకు ఒత్తిడి, మందలింపులు తప్పవు. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఒక సమస్యను అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తారు. ఆపద సమయంలో కుటుంబీకులు అండగా నిలబడతారు.