గురువారం, 28 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జులై 2022 (20:40 IST)

మంగళవారం భౌమ ప్రదోషం.. శివారాధన చేస్తే..?

Lord Shiva
ప్రదోష సమయంలో శివుడు అర్థనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్యరత్నావళిలో పేర్కొనడం జరిగింది. ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని భావిస్తారు.
 
ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమం. ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించటంతో సమానంగా భావిస్తారు. 
 
ప్రదోష  సమయంలో శివాలయాలలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయి. ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుడిని కూడా ఆరాధిస్తారు. 
 
నందీశ్వరుడు నాలుగు వేదాలు, 64 కళలను అభ్యసించిన నిష్ణాతుడైనప్పటికీ, వినయంతో వుండి, శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తాడని విశ్వసిస్తారు. అందువల్ల  నందీశ్వరుడిని ఆరాధించడం వలన బుద్ధికుశలత, మానసిక ఉల్లాసం లభిస్తాయి. 
 
శని త్రయోదశి మహా ప్రదోషం, 
ఆదివారం రోజు వస్తే దానిని రవి ప్రదోషం అని,
సోమవారం రోజు వస్తే దానిని సోమ ప్రదోషమనీ, 
మంగళవారం రోజు వస్తే దానిని భౌమ ప్రదోషమని, 
బుధవారం రోజు వస్తే దానిని బుధ ప్రదోషమని, 
గురువారం రోజు వస్తే దానిని గురు ప్రదోషమని, 
శుక్రవారం రోజు వస్తే దానిని శుక్ర ప్రదోషమని, 
శనివారం రోజు వస్తే దానిని శని త్రయోదశి అనీ, శని ప్రదోషమని పిలుస్తారు. 
 
వీటిలో శుక్ల పక్షంలో వచ్చే సోమ ప్రదోషం, కృష్ణపక్షంలో వచ్చే శని ప్రదోషములు విశేషమైనవిగా భావిస్తారు.